Maha Kumbh 2025: మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మహా కుంభమేళా(Maha Kumbh 2025)కు భక్తులు పోటెత్తారు. అమృతస్నానాల కోసం ఓ భక్తులు మరోవైపు ఊరేగింపుగా సాధువులు రావడంతో రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట(Maha Kumbh Stampede) జరిగింది

Maha Kumbh 2025: మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Maha Kumbh 2025 Stampede.. 30 Injured, here are the details(ANI)

Delhi, Jan 29:  మహా కుంభమేళా(Maha Kumbh 2025)కు భక్తులు పోటెత్తారు. ఇక ఇవాళ మౌని అమావాస్య(Mauni Amavasya) కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ఇవాళ ఒక్కరోజే 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేయగా ఇందుకు తగ్గట్టుగానే భక్తులు తరలివచ్చారు.

అమృతస్నానాల కోసం ఓ భక్తులు మరోవైపు ఊరేగింపుగా సాధువులు రావడంతో రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట(Stampede In Kumbh Mela 2025) జరిగింది. సంగం నది దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో అనేక మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాత్రి 1:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  రేపే మౌని అమావాస్య ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తియోగం..

ఒకరిపై ఒకరు పడిపోగా వారి ఆర్తనాదాలతో కుంభమేళాలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) స్పందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌(CM Yogi)తో మాట్లాడిన మోదీ... తక్షణమే బాధితులకు సహాయం చేయాలని అధికారులను ఆదేశించారు.

Maha Kumbh 2025  Stampede

సంగం నది(Sangam River) వద్ద అడ్డంకి విరిగిపోవడంతో తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. ఆ క్రమంలో భక్తులు ఒకరికొకరు పడిపోగా కొంతమంది గాయపడ్డారని, వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గంగానదికి సమీపంలోని ఏ ఘాట్‌లోనైనా పవిత్ర స్నానం చేయాలని సూచించారు. సంగం వద్ద మాత్రమే స్నానం చేయాలని భక్తులు అనుకోవద్దన్నారు.

మౌని అమావస్య సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రయాగ్​రాజ్​కు వచ్చిన భక్తులతో రైల్వేస్టేషన్​లు, బస్టాండ్​లు కిక్కిరిసిపోయాయి. ఇక కుంభమేళాలలో ఇప్పటివరకు 15 కోట్లమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

Maha Kumbh 2025 Stampede.. 30 Injured, here are the details

(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).