Odisha MLA Vehicle On Crowd: ఒడిశాలో మరో లఖీంపూర్ ఖేరీ తరహా ఘటన, ప్రజలపై దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారు, ఒకరు మృతి, 22 మందికి పైగా గాయాలు
ఒడిశా ఖుర్దాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది ప్రజలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.
Odisha MLA vehicle On crowd: ఒడిశా ఖుర్దాలో విషాదం చోటు చేసుకుంది. ప్రజలపైకి ఒడిశా ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్దేవ్ కారు దూసుకెళ్లగా.. ఒకరు చనిపోయారు. 22 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 15 మంది ప్రజలు, ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు. వారిని భువనేశ్వర్ ఎయిమ్స్‌కు తరలించారు.పంచాయతీ సమితి చైర్‌పర్సన్ ఎన్నికలు జరుగుతుండగా.. ఖుర్దా జిల్లాలోని బాన్‌పుర్ బ్లాక్ ఆఫీస్ ముందు ఉన్న ప్రజలపై బీజేడీ బహిష్కృత ఎమ్మెల్యే కారుతో దూసుకెళ్లారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు.. ఆ ఎమ్మెల్యేపై దాడికి దిగారు. ఆయన వాహనాన్ని ధ్వంసం చేశారు.
#Odisha MLA’s vehicle plows into crowd; video showing Chilika MLA
Prashant Jagdev in driver’s seat pic.twitter.com/iHNnKpa4Vm
— OTV (@otvnews) March 12, 2022
ఘటనా సమయంలో ఎమ్మెల్యే.. మద్యం మత్తులో ఉన్నారని స్థానికులు ఆరోపించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్దేవ్ను రక్షించిన పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన జగ్దేవ్ను రక్షించిన పోలీసులు.. భువనేశ్వర్‌లోని ఆసుపత్రికి తరలించారు.
(The above story first appeared on LatestLY on Mar 12, 2022 03:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

