PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం
విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా దేశం...మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.
Hyd, Nov 21: విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం దక్కింది. గయానా దేశం...మోదీకి ఆ దేశ అత్యున్నత పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్’ను అందజేసింది. ఈ పురస్కారాన్ని గయానా దేశ అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ మోదీకి అందజేశారు. ప్రపంచ దేశాలకు మోదీ అందిస్తున్న సహాయ సహకారాలకుగాను ఈ గుర్తింపు లభించింది.
అలాగే కరేబియన్ దేశం కామన్వెల్త్ ఆఫ్ డొమినికా.... తమ దేశ అత్యున్నత జాతీయ అవార్డును మోదీకి అందజేసింది. డొమినికా అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్.. ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా డొమినికా అవార్డ్ ఆఫ్ ఆనర్ తో సత్కరించారు. కొవిడ్ -19 సంక్షోభ సమయంలో మోదీ ఆ దేశానికి అందించిన మద్దతు, భారత్ – డొమినికా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ అత్యున్నత పురస్కారంతో సత్కరించామని సిల్వానీ బర్టన్ తెలిపారు. మోదీ చేసిన కృషికిగాను డొమినికా అత్యున్నత పురష్కారంతో సత్కరించారు. వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు
Here's Tweet:
PM Modi to address Guyana Parliament today, significant moment in global outreach
Read @ANI Story | https://t.co/8pEjFT1xqj#PMModi #GuyanaParliament #GlobalOutreach #BilateralRelations pic.twitter.com/oqvEUioBnh
— ANI Digital (@ani_digital) November 21, 2024
డొమినికా అత్యున్నత జాతీయ అవార్డుతో సత్కరించడం గౌరవంగా భావిస్తున్నాను అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ పురస్కారాన్ని 140 కోట్ల మంది భారత ప్రజలకు అంకితం చేస్తున్నానని వెల్లడించారు. భారతదేశం -డొమినికా రెండు ప్రజాస్వామ్య దేశాలు..ఈ రెండు దేశాలకు మహిళా అధ్యక్షురాళ్లు ఉన్నారు అన్నారు. ఈ పురస్రాకంతో ప్రధాని మోదీ అందుకున్న మొత్తం అంతర్జాతీయ అవార్డుల సంఖ్య 19కి చేరుకుంది.
Here's Tweet:
Gratitude to President Sylvanie Burton of Dominica for conferring the 'Dominica Award of Honour' upon me. This honour is dedicated to my sisters and brothers of India. It is also indicative of the unbreakable bond between our nations. pic.twitter.com/Ro27fpSyr3
— Narendra Modi (@narendramodi) November 20, 2024
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

