Banks Closing Down Reports: బ్యాంకులను మూసివేయడం లేదు! బ్యాంకుల మూసివేతపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన భారతీయ రిజర్వ్ బ్యాంక్
పంజాబ్- మహారాష్ట్ర కోఆపరేటివ్ (పిఎంసి) బ్యాంకులో పలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ బ్యాంకుపై ఆర్బీఐ 6 నెలల పాటు ఆంక్షలు విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో...
New Delhi, September 25: సెంట్రల్ బ్యాంకింగ్ సంస్థ కొన్ని వాణిజ్య బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సెప్టెంబర్ 25 బుధవారం స్పష్టం చేసింది. పంజాబ్- మహారాష్ట్ర కోఆపరేటివ్ (PMC Bank) బ్యాంకులో పలు అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ బ్యాంకుపై ఆర్బీఐ 6 నెలల పాటు ఆంక్షలు విధిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ బ్యాంకు ఖాతాదారులకు రోజుకు రూ. 1,000 మించి నగదు ఉపసంహరణ చేసుకునే వీలు లేకుండా పోయింది.
ఈ చర్య తర్వాత, ఆ మరుసటి రోజు ఆర్బీఐ బ్యాంకులను మూసివేస్తుంది, వెంటనే మీ ఖాతాలో ఉన్న డబ్బును విత్ డ్రా చేసుకోండంటూ సోషల్ మీడియాలో పుకార్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కల్పించుకొని కల్పిత వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టింది.
Teet by RBI:
Reports appearing in some sections of social media about RBI closing down certain commercial banks are false.
— ReserveBankOfIndia (@RBI) September 25, 2019
ఈ పుకార్లపై స్పందిస్తూ ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, "ఆర్బీఐ కొన్ని బ్యాంకులను మూసివేస్తుందంటూ సోషల్ మీడియాలో కొంటె పుకార్లు వ్యాపిస్తున్నాయి. ప్రజల విశ్వాసం పొందిన ఏ ప్రభుత్వ రంగ బ్యాంకులను మూసివేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు, అయితే ఖాతాదారులకు మెరుగైన సేవలందించేలా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చి వాటి మూలధనం పెంచేలా PSBలను బలోపేతం చేస్తుంది." అని చెప్పుకొచ్చారు.
(The above story first appeared on LatestLY on Sep 25, 2019 06:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

