Punjab Road Accident: పంజాబ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు టీచర్లు అక్కడికక్కడే మృతి, జీపు మధ్యలో ఇరుక్కుపోయిన మృతదేహాలు
పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్(Ferozpur)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతిచెందగా, మరో 11 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.జలాలాబాద్ నుంచి వివిధ స్కూళ్లలో పనిచేసే 14 మంది టీచర్లు(Teachers) జీపులో ఎక్కారు
Ferozpur, Mar 24: పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్(Ferozpur)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు టీచర్లు మృతిచెందగా, మరో 11 మంది టీచర్లు తీవ్రంగా గాయపడ్డారు.జలాలాబాద్ నుంచి వివిధ స్కూళ్లలో పనిచేసే 14 మంది టీచర్లు(Teachers) జీపులో ఎక్కారు.
వీరంతా ప్రతి రోజూ జీపులో వెళ్తుంటారు. ఖాయి ఫెమి కే గ్రామం సమీపంలో టీచర్లు ప్రయాణిస్తున్న జీపు.. ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జీపు డ్రైవర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెండు వాహనాలు బలంగా ఢీకొనడం వల్ల.. జీపు విండోలను బ్రేక్ చేసి మరీ మృతదేహాలను వెలికితీశారు. ఓవర్‌లోడ్ అయిన జీపు.. ట్రక్కును ఓవర్‌టేక్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
(The above story first appeared on LatestLY on Mar 24, 2023 12:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

