Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి.

Pushpa 2: The Rule: 80 దేశాల్లో ఆరు భాషల్లో పుష్ప 2 విడుదల, తొలి రోజే ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు, ప్రీరిలీజ్ బిజినెస్‌లో రికార్డు క్రియేట్ చేసిన పుష్పగాడు
Pushpa 3 Is Pushpa The Roar

Pushpa 2: The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప-2' ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రేపు రాత్రి నుంచి బెనిఫిట్ షోలను వేస్తున్నారు. ఈ చిత్రం 80 దేశాల్లో 6 భాషల్లో రిలీజ్ కాబోతోంది. తొలిరోజున ప్రపంచ వ్యాప్తంగా 55 వేల షోలు పడుతున్నాయి. ప్రీరిలీజ్ బిజినెస్ లో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. రూ. 670 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆడియో, డిజిటల్ రైట్స్, ఓటీటీ రూపంలో మరో రూ. 400 కోట్లు బిజినెస్ జరిగినట్టు సమాచారం.

పుష్ప 3 వచ్చేస్తోందా, లీక్ అయిన వైరల్ ఫోటో ఇదిగో, డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 ది రూల్

టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా ఒక మిలియన్ టికెట్స్ అమ్ముడైన చిత్రంగా 'పుష్ప-2' నిలిచింది. కేవలం బుక్ మై షోలో ఇన్ని టికెట్లు అమ్ముడుపోవడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో అయితే బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే ఫస్ట్ డే టికెట్స్ మొత్తం సేల్ అయ్యాయి.

(The above story first appeared on LatestLY on Dec 03, 2024 07:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).