Ram Temple in Ayodhya: అయోధ్య గర్భగుడిలో పాలరాతి సింహాసనం మీద రాముని విగ్రహం, ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు గల రాముని విగ్రహం ప్రతిష్ఠిస్తామని తెలిపిన ట్రస్టు
అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఎనిమిది అడుగుల ఎత్తైన బంగారు పూత పూసిన పాలరాతి సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచుతారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు.
Lucknow, Nov 1: అయోధ్యలోని రామ మందిరం గర్భగుడి లోపల ఎనిమిది అడుగుల ఎత్తైన బంగారు పూత పూసిన పాలరాతి సింహాసనంపై రామ్ లల్లా విగ్రహాన్ని ఉంచుతారని శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. ఈ సింహాసనాన్ని రాజస్థాన్‌లోని కళాకారులు తయారు చేస్తున్నారని, డిసెంబర్ 15 నాటికి ఇది అయోధ్యకు చేరుకుంటుందని ఆయన మంగళవారం తెలిపారు.
ఇది ఎనిమిది అడుగుల పొడవు, మూడు అడుగుల ఎత్తు , నాలుగు అడుగుల వెడల్పు ఉంటుంది. అలాగే గర్భగుడి నిర్మాణం పూర్తయిందని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.కాగా వచ్చే ఏడాది జనవరి 22న ఆలయంలో దేవతామూర్తులను ప్రతిష్ఠించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ్ ట్రస్ట్ (Shri Ram Janmbhoomi Teerth Kshetra) తెలిపింది
రామ మందిరంలో (Ram Temple in Ayodhya) మొదటి అంతస్తును డిసెంబరు 15 నాటికి సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయ్యాయని, మొదటి అంతస్తులో 17 పిల్లర్లు ఏర్పాటు చేశామని, మరో రెండింటిని త్వరలో ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. పరికర్మ మార్గ్ నిర్మాణం ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం గృహ మండపం పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ నెల చివరికల్లా రామ మందిరం బయట ఉన్న ప్రధాన గేటు నిర్మాణం పూర్తవుతుందని చెప్పారు. రామ మందిర నిర్మాణం కోసం భక్తులు పెద్ద ఎత్తున బంగారు, వెండి వస్తువులను విరాళాలుగా సమర్పించారని, వాటిని భద్రపరచడంలో అనేక సమస్యలు ఎదురయ్యాయన్నారు. భక్తులు సమర్పించిన బంగారు, వెండి వస్తువులను ప్రస్తుతం ఒక ప్రముఖ సంస్థ ఆధ్వర్యంలో కరిగించి భద్రపరుస్తున్నట్లు తెలిపారు.
గత వారం శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సభ్యులు ప్రధాని మోదీని కలిసి రామ మందిర ప్రారంభోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. జనవరి 22న దేవతామూర్తుల విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నాలుగు వేల మంది సాధువులు, 2,500 మంది ప్రముఖులు హాజరుకానున్నట్లు ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది.
(The above story first appeared on LatestLY on Nov 01, 2023 03:11 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

