Rs 2000 Note Exchange: రెండో రోజే మొదలైన రూ.2 వేల నోటు మార్పిడి కష్టాలు, కరెన్సీ లేక కొన్ని బ్యాంకుల్లో ఆగిపోయిన రూ.2000 నోట్ల మార్పిడి
కొన్ని బ్యాంకు శాఖల్లో నగదు కొరత ఏర్పడి, నోట్ల మార్పిడి రెండో రోజైన బుధవారం కరెన్సీ చెస్ట్ నుండి సరఫరా కోసం ఎదురుచూడడంతో ఉపసంహరించుకున్న రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేశారు.పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల మార్పిడి ప్రక్రియను బుధవారం తాత్కాలికంగా ఆపేశారు బ్యాంకర్లు.
New Delhi, May 25: కొన్ని బ్యాంకు శాఖల్లో నగదు కొరత ఏర్పడి, నోట్ల మార్పిడి రెండో రోజైన బుధవారం కరెన్సీ చెస్ట్ నుండి సరఫరా కోసం ఎదురుచూడడంతో ఉపసంహరించుకున్న రూ.2000 కరెన్సీ నోట్ల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేశారు.పెద్ద ఎత్తున జనాలు బ్యాంకులకు వస్తుండటంతో నగదు లేక నోట్ల మార్పిడి ప్రక్రియను బుధవారం తాత్కాలికంగా ఆపేశారు బ్యాంకర్లు.
మంగళవారం నుంచే రూ.2000 నోట్ల మార్పిడి మొదలవగా, రెండో రోజే బ్యాంకులకు కరెన్సీ కష్టాలు రావడం ఇప్పుడు ఒకింత ఆందోళనకరంగా మారింది. రూ.500, రూ.200, రూ.100 నోట్లు సరిపడా బ్యాంకు శాఖల్లో ఉండటం లేదని చెప్తున్నారు.కొన్ని బ్రాంచ్‌లలో మొదటి అర్ధభాగంలో ఊహించిన దానికంటే ఎక్కువ డిమాండ్ కారణంగా కొన్ని చోట్ల తాత్కాలికంగా రూ. 500 మరియు అంతకంటే తక్కువ విలువ కలిగిన కరెన్సీ కొరత ఏర్పడిందని వర్గాలు తెలిపాయి.
రూ. 2 వేల నోట్లు మార్చుకోవాలంటే ఆధార్ కార్డు అవసరమా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్లారిఫికేషన్ ఇదిగో..
దీంతో నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పట్లేదు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ నోట్ల మార్పిడి ప్రక్రియను నిరంతరం పరిశీలిస్తున్నామని చెప్తున్నా.. పర్యవేక్షణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. నోట్ల మార్పిడి మొదలైన రెండో రోజే బ్యాంకుల్లో కరెన్సీ కొరత ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 30దాకా రూ.2000 నోట్ల మార్పిడికి వీలుండగా, ఒకసారి రూ.20,000లకు మించి నోట్ల మార్పిడికి ఆర్బీఐ అవకాశం ఇవ్వని సంగతి తెలిసిందే. కాగా, చలామణిలో ఉన్న కరెన్సీలో రూ.2000 నోట్లు 10.8 శాతమని, వీటి విలువ రూ.3.6 లక్షల కోట్లని ఆర్బీఐ చెప్తున్నది.
2,000 రూపాయల నోట్ల మార్పిడి ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు ఢిల్లీ సర్కిల్‌లోని మా అన్ని శాఖల్లో రూ. 500, 200, 100 నోట్లను నిరంతరం సరఫరా చేస్తున్నామని కెనరా బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ (సిజిఎం) భవేంద్ర కుమార్ తెలిపారు.
(The above story first appeared on LatestLY on May 25, 2023 10:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

