Sankranti Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్య పెంపు, పండగ సీజన్‌కు ప్లాట్‌ఫాం ధరలనూ రెట్టింపు చేసిన రైల్వే శాఖ

పనిలోపనిగా సికింద్రాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను రూ. 10 నుంచి రూ.20కి పెంచారు. జనవరి 9 నుంచి 20 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.....

Sankranti Special Trains: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే, కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్య పెంపు, పండగ సీజన్‌కు ప్లాట్‌ఫాం ధరలనూ రెట్టింపు చేసిన రైల్వే శాఖ
Indian Railways| (photo-ANI)

Secunderabad, January 10: సంక్రాంతి పండగ (Sankranti Festival) సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను (Special Trains) నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే  (South Central Railway) ఒక ప్రకటనలో తెలిపింది. ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవాలని సూచించింది.

సికింద్రాబాద్-రాక్సాల్ స్పెషల్ జనవరి 14 మరియు 21 తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 9.40 గంటలకు బయలుదేరుతుంది; ఇదే రైలు (07092) జనవరి 17, 24 మరియు 31వ తేదీల్లో రాక్సాల్ జంక్షన్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు ప్రారంభమవుతుంది.

సికింద్రాబాద్-గౌహతి స్పెషల్ (02513) జనవరి 16, 23 మరియు 30 తేదీలలో ఉదయం 5.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది; తిరుగు ప్రయాణంలో, ఇదే రైలు నం. 02514 జనవరి 18, 25 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో రాత్రి 11.55 గంటలకు గౌహతి నుంచి బయలుదేరుతుంది.

సికింద్రాబాద్-గుడూర్ సువిధ స్పెషల్ (82740) జనవరి 10 న ఉదయం 8.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు గూడూర్ చేరుకుంటుంది.

సికింద్రాబాద్-మచిలిపట్నం సువిద స్పెషల్ (82743) జనవరి 11న రాత్రి 9:40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 6.05 గంటలకు మచిలిపట్నం చేరుకుంటుంది.

అలాగే కొన్ని రూట్లలో రైళ్ల సంఖ్యను పెంచారు. 67250/67249 సికింద్రాబాద్-తాండూర్-సికింద్రాబాద్ నడిచే MEMU ప్యాసెంజర్ అదనపు రైలు సాయంత్రం సికింద్రాబాద్ నుండి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు చిట్టాపూర్ వయా తాండూర్ చేరుకుంటుంది.

మరొకటి చిటాపూర్-సికింద్రాబాద్ MEMU ఉదయం ఉదయం 4.30 గంటలకు చిట్టాపూర్ నుండి బయలుదేరి, ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఇక పనిలోపనిగా సికింద్రాబాద్ మరియు కాచిగూడ స్టేషన్లలో ప్లాట్‌ఫాం టిక్కెట్ల ధరను రూ. 10 నుంచి రూ.20కి పెంచారు. జనవరి 9 నుంచి 20 వరకు పెరిగిన ధరలు అమలులో ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

(The above story first appeared on LatestLY on Jan 10, 2020 08:09 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).