Karnataka Shocker: ప్రిన్సిపాల్ కాదు కీచకుడు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ లో దారుణం, బాలికను లైంగికంగా వేధిస్తూ అడ్డంగా దొరికిపోయాడు..

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ప్రవిన్సపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ గాలెప్ప పూజారిని యాద్‌గిర్ మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు.

Karnataka Shocker: ప్రిన్సిపాల్ కాదు కీచకుడు, ప్రభుత్వ రెసిడెన్షియల్ హాస్టల్ లో దారుణం, బాలికను లైంగికంగా వేధిస్తూ అడ్డంగా దొరికిపోయాడు..
Rape Representative image.

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ప్రవిన్సపాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్ గాలెప్ప పూజారిని యాద్‌గిర్ మహిళా పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీసులు అరెస్టు చేశారు. ఆ విద్యార్థినితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఆ బాలికనుప్రిన్సిపాల్ లైంగికంగా వేధించినట్లు పోలీసులు తెలిపారు.

నిద్రలో వెంటాడిన పీడకలలు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థి, పీడ క‌ల‌లు రావడంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు సూసైడ్ లేఖ

ఈ విషయం వెలుగులోకి రావడంతో విద్యాశాఖ అధికారి స్కూలును సందర్శించి విచారణ జరిపారు. ప్రిన్సిపాల్‌పై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో జిల్లా విద్యా శాఖ కమిషనర్‌కు ఈ మేరకు నివేదిక అందచేశారు. నివేదిక ఆధారంగా ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేశారు. నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా డిఇఓను కమిషనర్ ఆదేశించారు. దీంతో ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Dec 24, 2022 02:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).