Shiv Nadar India's Most Generous Philanthropist: దాతృత్వంలో నెంబ‌ర్ 1 గా నిలిచిన శివ నాడార్, ప్ర‌తి రోజు రూ.5.9 కోట్లు విరాళం ఇచ్చి మొద‌టిస్థానం

ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న మేరకు విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఇక వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తల్లో కూడా దాతలు ఉంటారు. అలా దాతృత్వంలో మొదటి వరుసలో నిలుస్తారు ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ (Shiv Nadar). గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు.

Shiv Nadar India's Most Generous Philanthropist: దాతృత్వంలో నెంబ‌ర్ 1 గా నిలిచిన శివ నాడార్, ప్ర‌తి రోజు రూ.5.9 కోట్లు విరాళం ఇచ్చి మొద‌టిస్థానం
Shiv Nadar (PIC@ X)

Mumbai, NOV 07: దాతృత్వం అనేది ఒక వరం. ప్రతి ఒక్కరూ అవకాశం ఉన్న మేరకు విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఇక వ్యాపార వేత్తలు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తల్లో కూడా దాతలు ఉంటారు. అలా దాతృత్వంలో (Philanthropist) మొదటి వరుసలో నిలుస్తారు ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఫౌండర్ శివ్ నాడార్ (Shiv Nadar). గత ఐదేండ్లలో దేశంలోనే వరుసగా మూడోసారి అత్యంత ఉదారంగా విరాళాలిస్తున్న దాతల్లో శివ్ నాడార్ మొదటి స్థానంలో నిలుస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,153 కోట్ల విరాళాలు ఇచ్చారు. అంటే ప్రతి రోజూ రూ.5.9 కోట్లు విరాళం ఇస్తూ వచ్చారని ఎడిల్ గివ్ హరున్ ఇండియా ఫిలాంథ్రఫీ లిస్ట్ -2024 పేర్కొంది. శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా ఈ విరాళాలు అందజేశారు. ఇక మహిళల్లో ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేకని సతీమణి రోహిణి నిలేకనీ (Rohini Nilekhani) మొదటి స్థానంలో నిలుస్తారు.

US Conducts Hypersonic Missile Test: ప్రపంచదేశాలకు అమెరికా షాక్, గంటకు 15,000 మైళ్ల గరిష్ఠ వేగంతో దూసుకుపోయే సూపర్‌సోనిక్ మిసైల్‌ని పరీక్షించిన అమెరికా 

గత ఆర్థిక సంవత్సరంలో రూ.154 కోట్ల విరాళాలు అందజేశారు. రోహిణి నిలేకని ఫిలాంత్రఫీస్ అనే ఫౌండేషన్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో సేవలందిస్తున్న సంస్థలకు, పర్యావరణ సుస్థిరత కోసం విరాళాలు అందజేస్తుంటారు. దాతల్లో పిన్న వయస్కుడు జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ (Nikhil Kamath) మొదటి స్థానంలో ఉంటారు. మానసిక ఆరోగ్యం, ఆర్థిక అక్షరాస్యత, విద్యా రంగం కోసం విరాళాలు ఇస్తారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎడిల్ గివ్ హురున్ ఇండియా ఫిలాంథ్రపీ లిస్ట్ -2024లో 203 మంది దాతలు రూ.8,783 కోట్ల విరాళాలు ఇచ్చారు. రెండేండ్ల క్రితంతో పోలిస్తే 55 శాతం విరాళాలు పెరిగాయి. 18 మంది దాతలు రూ100 కోట్ల పై చిలుకు విరాళాలు ఇచ్చారు. 30 మంది దాతలు రూ.50 కోట్ల పై చిలుకు (2019 నుంచి 125 శాతం వృద్ధి), 61 మంది దాతలు రూ.20 కోట్ల పై చిలుకు (ఐదేండ్ల క్రితంతో పోలిస్తే 128 శాతం వృద్ధి) విరాళాలు అందజేశారు.

(The above story first appeared on LatestLY on Nov 07, 2024 10:39 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).