Bhopal Shocker: ట్యూషన్ ఫీజు అడిగినందుకు టీచర్‌పై స్టూడెంట్స్ కాల్పులు, కోచింగ్ సెంటర్‌ నుంచి బయటకు పిలిచి మాస్టార్‌ను కాల్చిన విద్యార్ధులు, సీసీటీవీలో రికార్డయిన దారుణం (వీడియో ఇదుగోండి!)

మూడేళ్లుగా బకాయిపడిన ట్యూషన్ ఫీజు చెల్లించమని (Tuition Fee) ఓ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు విద్యార్ధుల్ని కోరాడు. అంతే.. కంట్రీ-మేడ్ పిస్టల్‌తో ఆ ఉపాధ్యాయుడి మీద కాల్పులు (Students Fired Pistol) జరిపారు ఆ స్టూడెంట్స్.. సంచలనం కలిగించిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయుడి ప్రాణాలు తీయాలనుకున్నారు ఇద్దరు విద్యార్ధులు.

Bhopal Shocker: ట్యూషన్ ఫీజు అడిగినందుకు టీచర్‌పై స్టూడెంట్స్ కాల్పులు, కోచింగ్ సెంటర్‌ నుంచి బయటకు పిలిచి మాస్టార్‌ను కాల్చిన విద్యార్ధులు, సీసీటీవీలో రికార్డయిన దారుణం (వీడియో ఇదుగోండి!)
Students Fired Pistol (PIC@ Twitter)

Bhopal, June 23: మూడేళ్లుగా బకాయిపడిన ట్యూషన్ ఫీజు చెల్లించమని (Tuition Fee) ఓ కోచింగ్ సెంటర్ ఉపాధ్యాయుడు విద్యార్ధుల్ని కోరాడు. అంతే.. కంట్రీ-మేడ్ పిస్టల్‌తో ఆ ఉపాధ్యాయుడి మీద కాల్పులు (Students Fired Pistol) జరిపారు ఆ స్టూడెంట్స్.. సంచలనం కలిగించిన ఈ ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. చదువు చెప్పిన ఉపాధ్యాయుడి ప్రాణాలు తీయాలనుకున్నారు ఇద్దరు విద్యార్ధులు. బకాయిపడ్డ ట్యూషన్ ఫీజు అడిగినందుకు కంట్రీ-మేడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపారు. కలకలం రేపిన ఈ ఘటన భోపాల్ (Bhopal) మోరేనా జిల్లా జౌరా రోడ్డులో జరిగింది.

ఉపాధ్యాయుడు గిర్వార్ సింగ్ వద్ద ట్యూషన్ చెప్పించుకున్న ఇద్దరు స్టూడెంట్స్ అతనిని కోచింగ్ సెంటర్ బయటకు పిలిచారు. బైక్ మీద ఉన్న ఇద్దరు సింగ్‌ను మొదట బాగానే పలకరించారు. వీరిలో ఒకరు అకస్మాత్తుగా పిస్టల్ తీసి సింగ్ కడుపుపై కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడి నుంచి బైక్‌పై పారిపోయారు. గాయపడిన సింగ్‌ను దారిన పోయేవారు ఆసుపత్రికి తరలించారు.

Maharashtra: పురుషుడి కడుపులో 36 ఏళ్లుగా కవలలు, మగాడు ప్రెగ్నెంట్ కావడం చూసి షాక్ తిన్న వైద్యులు, బాధితునికి ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అనే వ్యాధి ఉందని నిర్థారణ 

దాడి చేసిన ఇద్దరు స్టూడెంట్స్ మూడేళ్ల క్రితం 12 వ తరగతి పరీక్షలు రాసేవరకూ సింగ్ కోచించ్ సెంటర్‌లో చదువుకున్నారని తెలుస్తోంది. స్టూడెంట్స్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jun 23, 2023 09:38 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).