Tamil Nadu: తమిళనాడులో దారుణం, ప్రభుత్వ స్కూల్ టాయ్‌లెట్లో పసికందు మృతదేహం, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసికందు..ట్రచ్చిలోని ఓ ప్రభుత్వ పాఠశాల టాయిలెట్‌లో శవమై (Newborn found dead) కనిపించింది. స్కూలు టాయిలెట్‌లో (inside toilet of govt school) లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్.. స్కూల్ ప్రిన్సిపల్‌కు సమాచారం అందించింది
Trichy, Dec 8: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే పుట్టిన పసికందు..ట్రచ్చిలోని ఓ ప్రభుత్వ పాఠశాల టాయిలెట్‌లో శవమై (Newborn found dead) కనిపించింది. స్కూలు టాయిలెట్‌లో (inside toilet of govt school) లభ్యమైన శిశువు మృతదేహాన్ని చూసి శానిటరీ వర్కర్.. స్కూల్ ప్రిన్సిపల్‌కు సమాచారం అందించింది. ఆమె ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించింది.
వారు తెలిపిన వివరాల ప్రకారం.. ట్రిచ్చిలోని కట్టూరు ఏరియాలో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది.
అయితే బుధవారం ఉదయం పాఠశాల ఆవరణలోని టాయిలెట్‌ను శుభ్రం చేసేందుకు ఓ పారిశుద్ధ్య కార్మికురాలు వెళ్లింది. టాయిలెట్‌లో చనిపోయిన పసికందును చూసిన ఆమె స్కూల్ ప్రిన్సిపల్‌కు సమాచారం అందించింది. టాయిలెట్ వద్దకు చేరుకున్న ప్రిన్సిపల్ పసికందును చూసి షాక్‌కు గురైంది. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పసికందు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మగ బిడ్డను ఎవరో టాయిలెట్‌లో పడేసి వెళ్లిపోయారని పోలీసులు పేర్కొన్నారు. పుట్టిన కొద్ది గంటల్లోనే శిశువు చనిపోయి ఉంటాడని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Dec 08, 2022 06:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

