Haridwar, May 31: తన ప్రేమకు అడ్డుపడుతున్నారన్న కోపంతో పదో తరగతి చదువుతున్న 15 ఏండ్ల బాలిక తండ్రి, సోదరుడిని (Killed father) అత్యంత దారుణంగా హత్యచేసింది. అనంతరం వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా (Chopped bodies) నరికి వాటిని ఫ్రిజ్‌లో దాచిపెట్టింది. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘాతుకానికి పాల్పడి తప్పించుకు తిరుగుతున్న ఆ బాలికను రెండున్నర నెలల తర్వాత పోలీసులు హరిద్వార్‌లో (Haridwar) అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో (Jabalpur) చోటు చేసుకుంది.
రైల్వేలో క్లర్క్‌గా పనిచేసే రాజ్‌కుమార్ విశ్వకర్మ కుమార్తె అయిన ఈ బాలిక ముకుల్ సింగ్ (19) అనే యువకుడితో ప్రేమలో పడి గత ఏడాది అతనిలో వెళ్లిపోయింది. దీంతో అతడిని పోక్సో చట్టం (POCSO ACT) కింద పోలీసులు అరెస్ట్ చేశారు. తమ ప్రేమ ఫలించాలంటే తన తండ్రిని అడ్డు తొలగించుకోవడం ఒక్కటే మార్గమని ఆ బాలిక నిర్ణయించుకుంది. దీంతో ఇద్దరూ హత్యకు పథకం వేశారు. అనుకున్నట్టుగానే బ్లేడ్‌తో కోసి రాజ్‌కుమార్‌ను హత్య చేశారు. అదే సమయంలో నిద్రలోంచి లేచిన తొమ్మిదేళ్ల సోదరుడిని సుత్తితో మోదీ హతమార్చారు. తర్వాత మృతదేహాలను ముక్కలుముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్‌లో ఉంచి పరారయ్యారు. కాగా, బాలిక హరిద్వార్‌లో పట్టుబడగా, ముకుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.