Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు

Telangana Assembly Session: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
Telangana Assembly Sessions(X)

Hyd, Dec 09: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీకి వాయిదా పడ్డాయి. ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై ప్రకటన చేశారు. ఈరోజు సాయంత్రం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సభలో వెల్లడించారు. ఈ విగ్రహావిష్కరణకు అందరూ రావాలంటూ సభాముఖంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మంత్రులు, సభ్యులు తమ తమ అభిప్రాయాలను తెలిపారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ ఎదుట నిరసనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ప్రతి ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు, అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం నమూనా అంశంపై వివరణ ఇచ్చారు. విగ్రహం నమూనా మార్పుపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాగ్వాదం జరిగింది. పలువురు సభ్యులు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారికంగా జరుపుకోవాలని సభలో నిర్ణయించారు. అనంతరం సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.

(The above story first appeared on LatestLY on Dec 09, 2024 05:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).