CM Revanth Reddy on Investments: దావోస్ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం, కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (CM Revanth Reddy on Investments) మాట్లాడారు
Hyd, jan 28: తెలంగాణ రాష్ట్రాన్ని వన్ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్లో దావోస్ ఒప్పందాల సాధన అతి పెద్దదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. సచివాయలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన (CM Revanth Reddy on Investments) మాట్లాడారు. దావోస్ సదస్సు ద్వారా దాదాపు రూ.1.80లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్టు చెప్పారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన సంస్థలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా కొందరు కుట్రలు చేశారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. దావోస్ పర్యటనతో రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులను పెట్టేలా మన రాష్ట్రం ఆకర్షించగలిగిందని చెప్పుకొచ్చారు. ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పారు.ఈ ప్రభుత్వంపై విశ్వాసం ఉంచుతూ అంతర్జాతీయ సంస్థలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి’’ అని సీఎం వివరించారు.
పెట్టుబడులకు అవసరమైన భూ కేటాయింపులు చేసి అన్ని రకాలుగా ఆ సంస్థలను ప్రోత్సహిస్తామన్నారు. మనందరం కలిసి కష్టపడితేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని చెప్పారు. సింగపూర్ ఆధ్వర్యంలో నడుస్తుస్తున్న ఐటీఈ సంస్థతో కూడా ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ఇది భవిష్యత్‌లో మన సాంకేతికను పెంపొందించడానికి ఉపయోగపడుతుందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ పెట్టుబడులు ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. ను వన్ ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. దావోస్ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టబడులు తీసుకొచ్చాం. ప్రణాళికతో వెళ్లాం కాబట్టే పెట్టుబడులొచ్చాయి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నందునే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎంఓయూల రూపంలో వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే మనం విజయం సాధించినట్లు. మూసీ నది పునరుజ్జీవనం అవసరం.. సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపాం..ఓ వైపు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులకు స్కిల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటే.. 17కంపెనీల పనులు జరుగుతున్నాయి’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.
(The above story first appeared on LatestLY on Jan 28, 2025 06:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

