Uttar Pradesh: తాళికట్టే సమయంలో వరుడు జంప్, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి తాళి కట్టించుకున్న వధువు, కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే..

యూపీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ వధువు మనువాడింది.యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది.

Uttar Pradesh: తాళికట్టే సమయంలో వరుడు జంప్, జుట్టు పట్టుకుని ఈడ్చుకు వచ్చి తాళి కట్టించుకున్న వధువు, కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే..
Wedding Representational Image

Lucknow, May 23: యూపీలో విచిత్రకర ఘటన చోటు చేసుకుంది. కట్టుకోబోయే వాడు పారిపోతుంటే చూస్తూ ఊరుకోలేదు. వెంటాడి పట్టుకొచ్చి మరీ వధువు మనువాడింది.యూపీలోని బారాబంకి పోలీసు స్టేషన్ పరిధిలో బారాదరి ప్రాంతంలో ఇది చోటు చేసుకుంది. సదరు వధువు రెండున్నరేళ్లుగా ఓ వ్యక్తితో అనుబంధం సాగిస్తోంది.

ఇరు వైపుల కుటుంబాల అంగీకారంతో పెళ్లి కుదిరింది. గత ఆదివారం భూతేశ్వర్ నాథ్ ఆలయంలో వీరికి వివాహం ఏర్పాటు చేశారు. కానీ, వివాహ ముహూర్తం సమీపించినా అక్కడ వరుడి జాడ లేదు. వధువు తనను మనువాడబోయే వాడి కోసం వేచి చూసి చూసి ఇక లాభం లేదనుకుని కాల్ చేసింది.తనను క్షమించాలని, తన తల్లిని తీసుకువచ్చేందుకు బుదాన్ వెళుతున్నట్టు చెప్పాడు.

కూతురు ప్రేమ గురించి తెలియక పెళ్లి చేసిన తల్లిదండ్రులు, పెళ్లయిన తెల్లారే ప్రియుడితో కలిసి వధువు ఆత్మహత్యాయత్నం, చికిత్స పొందుతూ పెళ్లికూతురు మృతి

దీంతో పెళ్లి కూతురు క్షణం ఆలస్యం చేయకుండా తన వాళ్లను వెంట పెట్టుకుని వరుడి కోసం వెతికేందుకు బయలుదేరింది. బరేలీకి 20 కిలోమీటర్ల దూరంలో భిమోర పోలీసు స్టేషన్ పరిధిలో అతడ్ని పట్టుకుంది. ఓ బస్సు ఎక్కుతుండగా అతడ్ని పట్టుకుని పెళ్లి మండపానికి తీసుకొచ్చారు. ఇంకేముంది.. మూడు ముడ్లు, మేళతాళాలు, అక్షింతలతో వివాహం ముగిసింది.

(The above story first appeared on LatestLY on May 23, 2023 06:25 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).