Vasantha Panchami 2021: వసంత పంచమి సందర్భంగా దేశప్రజలకు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి శుభాకాంక్షలు; వసంత పంచమి దేనిని సూచిస్తుంది, ఈరోజున సరస్వతి పూజలు ఎందుకు చేస్తారో తెలుసుకోండి
మంగళవారం, వసంత పంచమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సర్వసతీ దేవికి పూజలు నిర్వహిస్తున్నారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమైన సరస్వతి మాత దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. సరస్వతీ ప్రసన్నం ద్వారా మంచి బుద్ధి ప్రాప్తం అవుతుందని హిందువుల నమ్మకం.
New Delhi, February 16: మంగళవారం, వసంత పంచమి పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా సర్వసతీ దేవికి పూజలు నిర్వహిస్తున్నారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమైన సరస్వతి మాత దగ్గర అక్షరాభ్యాసం చేయిస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్ శుద్ధి కలుగుతుంది. సరస్వతీ ప్రసన్నం ద్వారా మంచి బుద్ధి ప్రాప్తం అవుతుందని హిందువుల నమ్మకం.
మాఘమాసం శిశిరఋతువులో వసంతం ఆగమనానికి స్వాగతచిహ్నంగా వసంత పంచమిని భావిస్తారు. ఈరోజు సరస్వతి దేవితో పాటు వసంత రుతువుని, రతీ మన్మధులను కూడా ఆరాధించడం కనిపిస్తుంది. హిందూ పురాణాల ప్రకారం ఋతువుల రాజు వసంతుడు కనుక వసంతుణ్ని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మన్మధుణ్ణి మరియు అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలిగి, జ్ఞానజ్యోతి వెలుగుతుందని చెప్పబడుతుంది.
వసంత పంచమి, సరస్వతి దేవి పూజల సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. "వసంత పంచమి మరియు సరస్వతి పూజల శుభ సందర్భంగా దేశవాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. వసంతకాలం రాకతో దేశ ప్రజలందరి జీవితాల్లో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని నేను ఆకాంక్షిస్తున్నాను" అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
"వసంత పంచమి, సరస్వతి పూజల పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ పండగ శుభాకాంక్షలు" అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.
बसंत पंचमी और सरस्वती पूजा के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) February 16, 2021
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ప్రజలకు వసంత పంచమి శుభాకాంక్షలు తెలిపారు.
नव उमंग व नई ऊर्जा के प्रतीक बसंत पंचमी के पावन पर्व की सभी देशवासियों को हार्दिक शुभकामनाएं।
विद्या की देवी मां सरस्वती सबके जीवन में ज्ञान, समृद्धि व उत्तम स्वास्थ्य प्रदान करें, ऐसी कामना करता हूँ। pic.twitter.com/bwgFRrLVgu
— Amit Shah (@AmitShah) February 16, 2021
Delhi CM Tweet
सभी देशवासियों को बसंत पंचमी की हार्दिक शुभकामनाएं, ईश्वर से प्रार्थना है कि ये बसंत आपके जीवन में खुशियां एवं सुख-समृद्धि लेकर आए। सभी पर मां सरस्वती की कृपा सदा बनी रहे।
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 16, 2021
"కొత్త ఉత్సాహానికి మరియు కొత్త శక్తికి ప్రతీక అయిన బసంత్ పంచమి పవిత్ర పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞానం, శ్రేయస్సు మరియు మంచి ఆయురారోగ్యాలను అందించాలని తల్లి సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాను" అని షా ట్వీట్ చేశారు
(The above story first appeared on LatestLY on Feb 16, 2021 09:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

