Bihar Tragedy: అనుమానాస్పద స్థితిలో 16 మంది మృతి, కలకలం రేపుతున్న బీహార్ పశ్చిమ చంపారణ్ జిల్లాలో మరణాలు, దర్యాప్తు ప్రారంభమైందని తెలిపిన బీహార్ ఉపముఖ్యమంత్రి రేణుదేవి

బీహార్‌లో తీవ్ర విషాదం (Bihar Tragedy) చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఏకంగా 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి (16 killed in suspicious circumstances) చెందడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Bihar Tragedy: అనుమానాస్పద స్థితిలో 16 మంది మృతి, కలకలం రేపుతున్న బీహార్ పశ్చిమ చంపారణ్ జిల్లాలో మరణాలు, దర్యాప్తు ప్రారంభమైందని తెలిపిన బీహార్ ఉపముఖ్యమంత్రి రేణుదేవి
Representational Image (Photo Credits: ANI)

Patna, July 17: బీహార్‌లో తీవ్ర విషాదం (Bihar Tragedy) చోటు చేసుకుంది. రాష్ట్రంలోని పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఏకంగా 16 మంది అనుమానాస్పద స్థితిలో మృతి (16 killed in suspicious circumstances) చెందడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఉదంతంతో సంబంధం ఉందని భావిస్తున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పశ్చిమ చంపారణ్‌లో రెండు రోజుల వ్యవధిలో అనుమానాస్పద స్థితిలో 16 మంది మృత్యువాత పడ్డారు. దీంతో అధికారులు హడలెత్తపోయారు. అధికారి కుందన్ కుమార్ దీనిపై స్పందిస్తూ గ్రామంలోని మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడామని, కల్తీ కల్లు కారణంగా ఈ ఉదంతం చోటుచేసుకోలేదని స్పష్టమయ్యిందన్నారు.

దీంతో ఈ ఘటనపై మరింతగా దర్యాప్తు చేపట్టాల్సివుందన్నారు. ఈ ఘటనపై ఉపముఖ్యమంత్రి రేణుదేవి (Bihar Deputy CM Renu Devi) మాట్లాడుతూ పశ్చిమ చంపారణ్ జిల్లాలో చోటుచేసుకున్న అనుమానాస్పద మరణాల గురించి తమకు తెలిసిందని, దీనిపై దర్యాప్తు ప్రారంభమైందన్నారు. స్థానికులను ప్రశ్నించి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నామన్నారు.

విశాఖలో విషాదం, తల్లితో పాటు ముగ్గురు పిల్లలు అనుమానాస్పద మృతి, కేసు దర్యాప్తు చేస్తున్న విశాఖ అరకు పోలీసులు

Here's ANI Update

మిస్టరీగా మారిన మరణాలపై బీహార్ ప్రభుత్వం దర్యాప్తును వేగవంతం చేసినట్లు సమాచారం

(The above story first appeared on LatestLY on Jul 17, 2021 02:09 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).