Bankipur Bypoll Result: బంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు.. ఆధిక్యంలో దూసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్.. బిజేపీ శ్రేణుల్లో మొదలైన టెన్సన్..
మూడు విడతల లెక్కింపు సమాచారం ప్రకారం.. ప్రశాంత్ కిషోర్ మొత్తం 5,032 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, బీజేపీకి చెందిన నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 767 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.
Bankipur Bypoll Result: బీహార్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తించిన బంకిపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. తొలి విడత రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి.. ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి తొలిసారి అడుగుపెట్టిన జన సూరజ్ పార్టీ (JSP) వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తన సమీప ప్రత్యర్థులపై స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు నితిన్ నబిన్ రాజ్యసభకు ఎన్నికవ్వడంతో ఖాళీ అయిన బంకిపూర్ స్థానానికి ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి బలమైన కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో.. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హా, ఆర్‌జేడీ (RJD) అభ్యర్థి రేఖా గుప్తాలపై ప్రశాంత్ కిషోర్ ఆధిక్యం ప్రదర్శించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల.. 45 లక్షల ఓట్ల తొలగింపు.. వెంటనే మీ ఓటు చెక్ చేసుకోండి..
పాట్నాలోని ఏఎన్ కాలేజీ (కళా భవన్) లెక్కింపు కేంద్ర వద్ద కట్టుదిట్టమైన బహుళ అంచెల భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎం (EVM) ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. మొత్తం 31 రౌండ్లలో ఈ లెక్కింపు జరగనుండటంతో.. రౌండ్లు పెరిగే కొద్దీ తుది ఫలితం స్పష్టమయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు తెలిపారు.
ప్రముఖ రాజకీయ వ్యూహకర్తగా అనేక పార్టీల విజయంలో కీలక పాత్ర పోషించిన ప్రశాంత్ కిషోర్‌కు ఇది మొదటి ప్రత్యక్ష ఎన్నికల పోటీ కావడం, పైగా బీజేపీ కంచుకోటలోనే ఆధిక్యం లభించడంతో జన సూరజ్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒక్క అసెంత్ స్థానం ఫలితం బీహార్ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై, నూతన పార్టీల ప్రభావంపై కీలక ముద్ర వేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
జన సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ మూడో విడత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మూడవ రౌండ్ ముగిసే సమయానికి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై ఆయన 1,162 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. మూడు విడతల లెక్కింపు సమాచారం ప్రకారం.. ప్రశాంత్ కిషోర్ మొత్తం 5,032 ఓట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, బీజేపీకి చెందిన నీరజ్ కుమార్ సిన్హా 3,870 ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ఆర్‌జేడీ అభ్యర్థి రేఖా గుప్తా 767 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు.
(The above story first appeared on LatestLY on Aug 03, 2026 11:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

