Karnataka Election Results 2023: జెడీఎస్ కంచుకోటలో కాంగ్రెస్ పాగా, పాత మైసూరులో బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చిన ఓటర్లు, రెండో స్థానానికి పరిమితమైన కుమారస్వామి టీం
కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. వెలువడతున్న ఫలితాల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
కర్ణాటకలో అధికార బీజేపీకి కాంగ్రెస్ పార్టీ దిమ్మతిరిగే షాకిచ్చింది. వెలువడతున్న ఫలితాల్లో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. బీజేపీకి (BJP) కన్నడ ఓటర్లు షాకిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా విజయాన్ని అందించే దిశగా ఫలితాలు సాగుతున్నాయి. హస్తం పార్టీ అభ్యర్థులు 119 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక అధికారాన్ని దక్కించుకోవాలంటే ప్రధానమైన ఓల్డ్ మైసూరు (Mysore) ప్రాంతంలో కాంగ్రెస్ దూసుకుపోతున్నది.
జేడీఎస్ కంచు కోట అయిన పాత మైసూరు ప్రాంతంలో మొత్తం 61 స్థానాలు ఉన్నాయి. అక్కడ 34 సీట్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో ఇప్పటివరకు జేడీఎస్‌కు (JDS) అడ్డా పాత మైసూర్‌లో కాంగ్రెస్ పార్టీ పాగావేసింది. 22 స్థానాలో జేడీఎస్ రెండో స్థానంలో ఉండగా, కేవలం 3 స్థానాలతో బీజేపీ మూడో ప్లేస్‌కు పరిమితమైంది.
అయితే నగరాలు, పట్టణ ప్రాంతాలు, కోస్తాలో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ ఓటర్లు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపారు. కోస్టల్ కర్ణాటక, బెంగళూరులో అధికార బీజేపీ తన ఆధిపత్యాన్ని నిలుపుకోగా, హైదరాబాద్ కర్ణాటక, నార్త్ కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మెజార్టీ స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతున్నారు. ఇక 15 కార్పొరేషన్లు, 75 నగర పంచాయతీల్లో బీజేపీ పార్టీ ఆధిక్యంలో ఉన్నది.
(The above story first appeared on LatestLY on May 13, 2023 12:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

