గుడ్డు (Egg), పన్నీర్ (Paneer) (Egg, Paneer) ఒకేసారి తినొచ్చా? వీటిని కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదా? ఈ కాంబినేషన్‌ని డైట్లో చేర్చొచ్చా? ఈ ప్రశ్నలకి సమాధానం ప్రముఖ న్యూట్రిషనిస్ట్ లు ఇలా చెబుతున్నారు. బరువు తగ్గాలంటే కేలరీలు తక్కువ, ప్రొటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్‌ని డైట్లో చేర్చాలి. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు గుడ్లు, పన్నీర్ (Paneer) ఎక్కువగా తింటుంటారు. ఈ రెండింట్లోనూ ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి చాలా టైం పడుతుంది. అలాగే కొంచెం తిన్నా కడుపు నిండినట్టు అనిపిస్తుంటుంది. ఇవి తినడం వల్ల ఆకలిని తగ్గించే హార్మోన్లు రిలీజ్ అయ్యి చాలాసేపటి వరకు ఏం తినాలనిపించదు కూడా. దాంతో సులభంగా బరువు తగ్గొచ్చు. అయితే కొందరు పన్నీర్ (Paneer), గుడ్లు ఒకే మీల్లో తింటుంటారు? మరి ఈ కాంబినేషన్ వెయిట్ లాస్కి ప్లస్సా? మైనస్సా? అంటే ప్లస్ అనే అంటున్నారు ఈ న్యూట్రిషనిస్ట్.
పన్నీర్ (Paneer), కోడి గుడ్లని కలిపి తింటే లాభమే తప్ప నష్టం ఉండదు. ఈ రెండింట్లో ప్రొటీన్, క్యాల్షియం, విటమిన్– బి 12, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దాంతో బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు కరుగుతుంది. అలాగే ఇవి రెండూ పైన చెప్పినట్టుగా డైజెషన్ ట్రాక్‌ని స్లో చేసి బరువు తగ్గడానికి సాయపడతాయి. అయితే డైట్లో ఉన్నవాళ్లు పన్నీర్ (Paneer) టిక్కా, స్క్రాంబుల్డ్ పన్నీర్ (Paneer), పన్నీర్ (Paneer) 65 లాంటివి మాత్రమే తినాలి. పన్నీర్ (Paneer) బటర్ మసాలా లాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టాలి. కోడిగుడ్లని కూడా వీలైనంతవరకు ఉడకబెట్టుకుని మాత్రమే తినాలి.
ఒక కోడిగుడ్డు (Egg)లో 4.8 గ్రాములు ఫ్యాట్, విటమిన్–ఎ, క్యాల్షియం, జి విటమిన్ – డి, రిబో ఫ్లెవిన్, విటమిన్– బి12, ఫొలేట్, విటమిన్– ఈ, నియాసిన్, ఐరన్ ఉంటుంది. వీటన్నింటి వల్ల తేలిగ్గా బరువు తగ్గొచ్చు. కోడి గుడ్డు (Egg)లో శరీరానికి కావాల్సిన ఎసెన్షియల్ అమీనో యాసిడ్స్ అన్నీ ఉంటాయి. ఇవి శరీర బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి.
వంద గ్రాముల పన్నీర్ (Paneer)లో 1.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, 72 కేలరీలు, 83 గ్రాముల క్యాల్షియం ఉంటుంది. క్యాల్షియం ఎముకల్ని, దంతాల్ని బలంగా చేస్తుంది, బాడీలో పేరుకున్న ఫ్యాట్‌ని కరిగించడానికి సాయం చేస్తుంది. అదెలాగంటే..క్యాల్షియం బాడీ కోర్ టెంపరేచర్ థర్మోజెనెసిస్ పెంచుతుంది. దానివల్ల మెటబాలిజం బూస్ట్ అయ్యి బరువు తగ్గొచ్చు.