Adhika Shravana Masam: రేపటి నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభం, ఈ తప్పులు చేస్తే జీవితంలో పెళ్లి కాదు, ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోండి..?

ఈ అధిక శ్రావణ మాసం జూలై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణ మాసం ఉంది. ఈ అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు.

Adhika Shravana Masam: రేపటి నుంచి అధిక శ్రావణ మాసం ప్రారంభం, ఈ తప్పులు చేస్తే జీవితంలో పెళ్లి కాదు, ఏ తప్పులు చేయకూడదో తెలుసుకోండి..?
Image credit - Pixabay

ఈ సంవత్సరంలో అధిక శ్రావణ మాసం జూలై 18 నుంచి ప్రారంభం కానుంది. దీన్ని అధిక శ్రావణ మాసం గా పిలుస్తారు. సాధారణంగా సంవత్సరానికి 12 నెలలు మాత్రమే ఉంటాయి. కానీ తెలుగు మాసాల్లో మార్పులు వస్తాయి. ఇందులో భాగంగా ఈ సారి అధిక శ్రావణ మాసంతో కలిపి 13 నెలలు అన్నమాట. ఈ అధిక శ్రావణ మాసంలో ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ అధిక శ్రావణ మాసం జూలై 18 నుంచి మొదలై ఆగస్టు 16వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణ మాసం ఉంది. ఈ అధికమాసంను శూన్య మాసం అని కూడా పిలుస్తారు. అధిక మాసంలో ముహూర్తాలు చూసి పెట్టుకొనే శుభకార్యాలు, పెళ్లిళ్లు, ఉపనయనం, సీమంతం, భూమి పూజలు, శంకుస్థాపన, గృహ ప్రవేశం, కొత్త వ్యాపార సముదాయాల ప్రారంభోత్సవం, వాస్తు పూజలు వంటివి చేయద్దని పండితులు చెప్తుంటారు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

కాని ఈ నెలలో తప్పనిసరిగా చేయాల్సిన పితృకార్యాలు మాత్రం చేయవచ్చని, ఆర్ధికం లాంటివి మానకుండా బ్రహ్మణుడికి సమర్పించవచ్చని పండితులు సూచిస్తున్నారు. అధిక మాసం కాబట్టి ఈ నెలలో చేసే ఏ పూజ అయినా అధిక ఫలితం లభిస్తుందని వేదాంతుల అభిప్రాయం. అందుకే ఆలయాలను ఇందుకు సిద్ధం చేశారు. గుడుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక మాసం అయినా భక్తులు వస్తారని నిర్వాహకులు చెప్తున్నారు.

(The above story first appeared on LatestLY on Jul 17, 2023 06:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).