Narasimha Runa Vimochana Stotram: అప్పుల బాధ భరించలేకపోతున్నారా...అయితే లక్ష్మీ నరసింహ స్వామికి చెందిన ఈ మంత్రం చదివితే, రుణ విమోచన పొందడం ఖాయం..
రుణ బాధలు తొలగి పోవడానికి నృసింహ స్తోత్రం పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని రోజూ పఠించే వారికి రుణబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుభఫలితాలు చేకూరుతాయి.
రుణ బాధలు తొలగి పోవడానికి నృసింహ స్తోత్రం పఠించడం మంచిది. ఈ మంత్రాన్ని రోజూ పఠించే వారికి రుణబాధలు తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. శుభఫలితాలు చేకూరుతాయి.
రుణ విమోచన నరసింహ స్తోత్రం
ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి నే నమః
దేవతా కార్య సిద్యర్థం సభాస్తంభ సముద్భవమ్
శ్రీ నృసింహం మహవీరం నమామి రుణముక్తయే
లక్ష్యాలింగత వామాంగం భక్తానాం వరదాయకమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే
ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం
శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే
స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజ విషనానాశనమ్
శ్రీనృసింహం మహావీరం నమామి రుణముక్తయే
సింహనాదేన మహతా దిగ్ధంతిభయనాశనమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే
ప్రహ్లాద వరదం శ్రీ శం దైత్యేశ్వర విదారిణమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే
క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే
వేదవేదాంత యజ్ఞశం బ్రహ్మ రుద్రాది వందితమ్
శ్రీ నృసింహం మహావీరం నమామి రుణముక్తయే
య ఇదం పఠతే నిత్యం రుణమోచన సంజ్ఞితమ్
అనృణే జాయతే సత్యొ ధనం శీఘ్ర మాప్నుయాత్.
Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ..
అలాగే పూర్వ జన్మ పాపాలు తొలగించుకోవడం.. తెలిసీ తెలియని పాపాల నుంచి గట్టెక్కాలంటే.. మనం చేయాల్సిందల్లా శ్రీ నృసింహ స్వామిని పూజించాలి. పాపాలు తొలగిపోవాలంటే.. భక్తిని మించిన పరిహారం లేదు. పూర్తి విశ్వాసంతో.. నరసింహ స్వామిని శరణు కోరితే.. పాపాలు తొలగిపోవడం తద్వారా ఈతిబాధల నుంచి తప్పించుకోవడం వంటివి చేయొచ్చు. తూర్పు దిశలో ఇంట్లోని పూజగదిలో నరసింహ స్వామి పటాన్ని వుంచి పూజించాలి. రోజూ శుచిగా స్నానమాచరించి.. నరసింహ ప్రభక్తి శ్లోకాన్ని 3, 12, 24, 48 సార్లు పారాయణం చేయడం ద్వారా కుటుంబ బాధలుండవు. ఈ శ్లోకాన్ని పఠించేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామి పటం ముందు దీపం వెలిగించి.. మరిగించి చల్లార్చిన ఆవు పాలను లేదా పానకాన్ని నైవేద్యం చేయాలి. ఈ ప్రసాదాన్ని కుటుంబంలోని అందరూ తీసుకోవాలి. ఇలా 48 రోజుల పాటు నరసింహ స్వామిని ఆరాధించినట్లైతే కోరిన కోరికలు నెరవేరుతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Jul 26, 2023 06:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

