Astrology: ఫిబ్రవరి 2 వసంత పంచమి ఈ రోజున ఈ పనులు చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది..

Astrology: వసంత పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండుగను మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానానికి దేవత అయిన సరస్వతి దేవి అమ్మవారిని పూజిస్తారు.

Astrology: ఫిబ్రవరి 2 వసంత పంచమి ఈ రోజున ఈ పనులు చేస్తే అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది..
Goddess Saraswati (Photo Credits: Pixabay)

Astrology: వసంత పంచమికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఈ పండుగను మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున జ్ఞానానికి దేవత అయిన సరస్వతి దేవి అమ్మవారిని పూజిస్తారు. విద్యాలయాల్లో, కళాశాలలో అమ్మవారి విగ్రహానికి పూజిస్తారు. ఈ రోజున సరస్వతి దేవికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు బట్టలు ధరిస్తారు. ఆ దేవికి పసుపు లేదా కుంకుమ రంగులో ఉన్న పండ్లను, పువ్వులను, బట్టలను నైవేద్యాలుగా సమర్పిస్తారు. ఈసారి వసంత పంచమి పండుగ ఏ రోజు వచ్చిందో తెలుసుకుందాం. ఆరోజు ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలుసుకుందాం..

వసంత పంచమి రోజు ఏ పనులు చేయాలి- వసంత పంచమి రోజున ఉదయాన్నే 5గంటలకు నిద్రలేచి ఉదయించే సూర్యుడికి నమస్కరించుకోవాలి. తర్వాత స్నానం చేసి పసుపు బట్టలను ధరించి సరస్వతి దేవిని పూజించడం ప్రారంభించాలి. ఈ పూజలో సరస్వతి దేవికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు బట్టలను పసుపు రంగు ఆహారాలను పువ్వులను సమర్పించాలి. సరస్వతి దేవికి పసుపు రంగు అంటే చాలా ప్రీతి అంతేకాకుండా ఆరోజు తీపి పాయసంని పసుపు రంగులో ఉండే విధంగా నైవేద్యంగా పెట్టే లాగా చేయాలి. కుంకుమ పువ్వుతో కీర్ కూడా చేసి ఆ సరస్వతి దేవికి నైవేద్యంగా పెట్టవచ్చు. దీనితోపాటు సరస్వతి దేవి అమ్మవారి దగ్గర పసుపు ముద్దను కూడా ఉంచాలి. ఈ రోజున కొత్త పుస్తకాలను పేపర్ పెన్నులను పలకలను మీరు వ్యాపారం చేసే ఖాతా పుస్తకాలను రిజిస్టార్లను సరస్వతి దేవి అమ్మవారి దగ్గర ఉంచడం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. లభిస్తుంది కష్టాలు తొలగిపోతాయి ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం గ్యాస్ స్టవ్ ఏ దిక్కున ఉంటే మంచిది ...

వసంత పంచమి రోజున ఏ పనులు చేయకూడదు- వసంత పంచమి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పనులు చేయకూడదు. ముఖ్యంగా చెట్లను మొక్కలను నరకవద్దు. ఈ రోజున పొరపాటున కూడా మాంసాహారము, మద్యం సేవించడం కూడా అంతా మంచిది కాదు. ఈరోజున ఉపవాసం ఉండి సాయంత్రం సాత్విక ఆహారాన్ని తీసుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అంతేకాకుండా మీరు మాట్లాడే వారితో మాటల విషయంలో పదునైన పరుషమైన మాటలు మాట్లాడకండి. ఎవరితో గొడవ పెట్టుకోకండి. లేని ప్రసంగాలను నియంత్రించండి. ఇవన్నీ చేసినట్లయితే ఆ సరస్వతి దేవి అమ్మవారి కటాక్షం పైన ఎల్లప్పుడూ ఉండి మీకు మీరు చేసే పనులకు మీ పిల్లలకు ఎంతో అనుగ్రహాన్ని కలిగించి అన్ని శుభ ఫలితాలను అందిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు

(The above story first appeared on LatestLY on Jan 29, 2025 03:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).