Astrology: ఫిబ్రవరి 5వ తేదీన గురుడు, చంద్రుడు గ్రహాల అపూర్వ కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సంపదకు, ఆనందాని,కి ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ రెండు గ్రహాలు ఉంటాయి.

Astrology: ఫిబ్రవరి 5వ తేదీన గురుడు, చంద్రుడు గ్రహాల అపూర్వ కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
astrology

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సంపదకు, ఆనందాని,కి ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ రెండు గ్రహాలు ఉంటాయి. అయితే ఫిబ్రవరి 5వ తేదీన గురుడు, చంద్రుడు ఈ రెండు గ్రహాలు కూడా కలయిక ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ కలయిక వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీన రాశి- మీన రాశి వారికి గురుడు చంద్రుడు కలయిక శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ రాశి వారికి కోరుకున్నచోట ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. కమ్యూనికేషన్ మీడియా రంగంలో ఉన్నవారికి మంచి శుభ ఫలితాలు ఉంటాయి. వివాహం కాని వారికి వివాహమయ్య అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Vastu Tips: ఇంటి హాలులో టీవీ ఏ దిక్కున ఉండాలి? 

మేషరాశి- మేష రాశి వారికి చంద్రుడు, గురుడు అపూర్వ కలయిక ఎన్నో శుభ ఫలితాలను అందిస్తుంది. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఇది మీకు మానసిక ఆందోళన తొలగిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో ఉత్తీర్ణలో అవుతారు. కోరుకున్న చోట సీటు లభిస్తుంది. వ్యాపారస్తులు విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. ఇది మంచి లాభాలను తీసుకొని వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. ఏలినాటి శని తొలగిపోతుంది. అదృష్టం వరిస్తుంది.

కన్యా రాశి- కన్య రాశి వారికి గురుడు చంద్రుడి కలయిక సానుకూల ప్రభావం అందిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఎప్పటినుంచోన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలకు వెళతారు. వివాహం కాని వారికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్న నూతన ఇంటికల నెరవేరుతుంది. పిల్లలు లేని వారికి ఈ సంవత్సరం పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు. ఆకస్మిక ధన లాభం వస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. 

(The above story first appeared on LatestLY on Jan 28, 2025 03:12 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).