Astrology: నవంబర్ 24న కుజుడు, చంద్రుని అనుగ్రహం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ,కుజుడు అన్ని రాశుల పైన మార్పులు తీసుకువస్తుందని నమ్ముతారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ,కుజుడు అన్ని రాశుల పైన మార్పులు తీసుకువస్తుందని నమ్ముతారు. అయితే నవంబర్ 24వ తేదీన కుజుడు, చంద్రుని అనుగ్రహం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ మూడు రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మకర రాశి- మకర రాశి వారికి చంద్రుడు, కుజుడు కలయిక వల్ల చాలా సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఆర్థిక సంబంధించిన నిర్ణయాలను ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఉద్యోగం చేసే వారికి వారి కార్యాలయాల్లో మంచి ప్రశంసలు అందుతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. ఆకస్మికంగా ధన లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. రచనలు కలలు వంటి వాటిలో పనిచేయడానికి ఆసక్తి పెరుగుతుంది.. వివాహితులు తమ జీవిత భాగస్వామితో బలమైన బంధాన్ని ఏర్పరచుకుంటారు.
Vastu Tips: మీ బెడ్ రూం నుండి ఈ 5 వస్తువులను వెంటనే తొలగించండి ...
కర్కాటక రాశి- కర్కాటక రాశి వారికి చంద్రుడు, కుజుడి అనుగ్రహం వల్ల అనేక సానుకూల ఫలితాలు లభిస్తాయి. మీకు ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అయితే కొన్ని ఖర్చులు పెరగడం ద్వారా మీకు ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పని చేసే చోట కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు. దీని వల్ల తల్లిదండ్రుల్లో ఆనందం ఉంటుంది. షుగర్ పేషెంట్స్ కొంచెం ఆరోగ్యం పైన శ్రద్ధ పెడితే మంచిది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు.
తులారాశి- తులా రాశి వారికి కుజుడు, చంద్రుని అనుగ్రహం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి. ఏ పని చేసినా కూడా ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఇది దీని వల్ల మీకు విజయాన్ని అందిస్తుంది. ఆర్థిక లాభాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెడతారు. అది మంచి లాభాలను తీసుకువస్తుంది. మీరు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఖర్చు పెడితే మంచిది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టడం మంచిది. లేకపోతే ధన నష్టం అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. కోర్టు సమస్యలు పరిష్కారం అవుతాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మీరు పని చేసే చోట గౌరవం పెరుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Nov 19, 2024 04:10 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

