Astrology, Rasi Phalalu 8th May 2022: ఈ రాశుల వారికి ఈ రోజు వ్యాపారంలో నష్టం, ఈ రాశుల వారు స్నేహితులతో గొడవ పడే చాన్స్, ఈ రాశుల వారు రుణం నుంచి విముక్తి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Horoscope Today 8 May 2022: ఆదివారం నాడు, వృషభ రాశి వారు తమ ఆత్మీయులతో అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు, ఎందుకంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ సొంతం, తుల రాశి వారికి విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ప్రయత్నాలు కొనసాగించాలి.
Horoscope Today 8 May 2022: ఆదివారం నాడు, వృషభ రాశి వారు తమ ఆత్మీయులతో అనవసరంగా కోపం తెచ్చుకోకూడదు, ఎందుకంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ తమ సొంతం, తుల రాశి వారికి విదేశాలలో ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, ప్రయత్నాలు కొనసాగించాలి.
మేషం
చేపట్టిన పనులు అంతంత మాత్రంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. వ్యాపారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. ఆప్తులతో ధన విషయంలో మాట పట్టింపులుంటాయి. వృత్తి ఉద్యోగాలలో కొత్త సమస్యలు కలుగుతాయి. విద్యార్థులు మరింత కష్టపడాలి.
వృషభం
ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ధనలబ్ది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో పలుకుపడి పెరుగుతుంది. సోదర వర్గం నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు.
మిధునం
మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ఋణ ఒత్తిడి తొలగడానికి నూతన ఋణాలు చెయ్యాల్సి వస్తుంది. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ఇంటాబయట అందరితో మాటలు పడవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగమున ప్రతికూల వాతావరణం ఉంటుంది.
కర్కాటకం
సమాజంలో పెద్దల ఆదరణ లభిస్తుంది. దూర ప్రయాణములు లాభసాటిగా సాగుతాయి. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. వృత్తి, ఉద్యోగాలలో సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
సింహం
ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. బంధుమిత్రులు కొన్ని వ్యవహారాలలో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలలో ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.
కన్య
చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుండి బయట పడతారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. దూరపు బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో కీలక సమాచారంతో ఊరట చెందుతారు. వ్యాపారాలలో అనుకొకుండా లాభాలు అందుతాయి.
తుల
ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ధన వ్యవహారాలలో శుభవార్తలు అందుతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు గతం కంటే మరింత మెరుగ్గా రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు అంచనాలు అందుకుంటారు.
వృశ్చికం
కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసికంగా ఇబ్బంది కలిగిస్తాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆదాయ విషయంలో లోటు పాట్లు ఉంటాయి. సన్నిహితులతో మాటపట్టింపులు కలుగుతాయి.
ధనస్సు
అధికారులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలు అకస్మాత్తుగా వాయిదా పడతాయి. మీ మాటలు కుటుంబ సభ్యులకు నచ్చవు. నిరుద్యోగులు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.
మకరం
చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ విషయంలో కీలక నిర్ణయాలు చేస్తారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితుల నుండి బయట పడతారు.
కుంభం
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు రాజీ అవుతాయి. వ్యాపారమున స్థిరమైన ఆలోచనలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.
మీనం
చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం ఉండదు. వ్యాపార వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు సతమతం చేస్తాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యటం మంచిది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలుంటాయి. ఉద్యోగమున తగిన గుర్తింపు ఉండదు.
(The above story first appeared on LatestLY on May 08, 2022 10:19 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

