Chukkala Amavasya: చుక్కల అమావాస్యరోజు ఇలా చేస్తే పితృదేవతలకు పుణ్యం, కొత్తకోడళ్లు తప్పకుండా చుక్కల అమవాస్యకు ఇవి పాటించాల్సిందే! ఆషాడం చివరిరోజున ఈ పనులు చేస్తే శ్రావణంలో డబ్బే...డబ్బు
తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కోడళ్లు (New Brides)కూడా ఈ నోముని నోచుకుంటారుట. ఈ వ్రతానికి ప్రధానదైవం గౌరీదేవి. ఒకపీటపై బియ్యం పిండితో మొదటి సంవత్సరం వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు.
Hyderabad, July 27: ఈ ఏడాది జూలై 28 గురువారం రోజున చుక్కల అమావాస్య (Chukkala amavasya) వస్తుంది. ఆషాఢ మాసంలోని చివరి రోజైన చుక్కల అమావాస్య రోజున పితృదేవతలను తల్చుకున్నా, గౌరీవ్రతం చేసినా, దీపపూజ(Deepa pooja) నిర్వహించినా గొప్ప ఫలితం దక్కుతుందని అంటున్నారు పెద్దలు. ఎందుకంటే… హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో, జులై మాసంలో వచ్చే కర్కాటక సంక్రాంతికి (Sankranthi) కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం (uttarayanam) మొదలైతే, కర్కాటక సంక్రాంతికి దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు(Forefathers) మనకు సమీపంలోనే ఉంటారని చెబుతారు. అందుకనే దక్షిణాయంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలను విడిస్తే మంచిదని సూచిస్తారు. ఇక ఆషాఢమాసంలో చేసే జపతపాలకు, దానధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని కూడా పెద్దల మాట. కాబట్టి ఈ రోజున పెద్దలని తల్చుకుంటూ పితృకర్మలు నిర్వహించినా, వారి పేరున దానధర్మాలు చేసినా పెద్దల ఆత్మశాంతిస్తుందన్నమాట!
ఆషాఢ అమావాస్య(Ashada amavsya) రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కాబట్టి ఈ శ్రావణంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ, మాసానికి ముందు రోజున కన్నెపిల్లలు గౌరీదేవిని(Gouri pooja) పూజిస్తారు. ఇందుకోసం పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి, ఆమెను కొలుచుకుంటారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు గౌరీపూజ చేసుకుని ఆమె రక్షను ధరించిన అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు.
Vastu Tips: శ్రావణ మాసంలో ఈ నియమాలు పాటిస్తే వాస్తు ప్రకారం మీ ఇంటికి ఆర్థిక సమస్యలు ఎప్పటికీ రావు
ఈ ఆషాఢ అమావాస్య రోజున అవివాహితలే కాదు… చుక్కల అమావాస్య’ పేరుతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త కోడళ్లు (New Brides)కూడా ఈ నోముని నోచుకుంటారుట. ఈ వ్రతానికి ప్రధానదైవం గౌరీదేవి. ఒకపీటపై బియ్యం పిండితో మొదటి సంవత్సరం వంద చుక్కలు పెట్టి వాటి మీద వంద దారపు పోగులను ఉంచుతారు. ఉంచుతారు. ఆ దారపు పోగులను ఒక దండగా అల్లుకుని మర్నాటి వరకూ ధరిస్తారు. స్తోమత ఉన్నవారు నోము సందర్భంగా బంగారపు చుక్కలను కూడా దానం చేసేవారట. ఈ సంఖ్య సంవత్సరానికో వంద చొప్పున పెరిగి ఐదో సంవత్సరం ఐదు వందలకు చేరుతుంది.ఐదు సంవత్సరాల వరకు ఆచరించే ఈ వ్రతంలో చివరి సంవత్సరం ఉద్యాపనగా స్తోమత ఉన్నవారు బంగారపు చుక్కలను కూడా దానం చేస్తారు. తమ మాంగళ్యం కళకాలం నిలచి ఉండాలని గౌరమ్మ ను వేడుతారు. ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీపపూజ చేయడం కూడా కనిపిస్తుంది. ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి , చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికీ, అనారోగ్యానికీ చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీపపూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్కపలకలని శుభ్రంగా అలికి , వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. మనం అంతగా పట్టించుకోని చుక్కల అమావాస్య వెనకాల ఇన్ని తతంగాలు ఉన్నాయన్నమాట.
‘అమ’ అనే అవ్యయానికి ‘కలిసి (కూడి) ఉండటం’ అని అర్థం. అదే అమావాస్య. ‘ఎవరి కలయిక’ అంటే సూర్యుడు- చంద్రుడు ఎదురెదురుగా కాసేపు రావడం. దక్షణాయణంలోని ఈ ‘తొలి అమావాస్య’ వారికి ఆహ్వానం పలుకుతుంది. ఆరోజు వారికి తర్పణాలు సమర్పిస్తారు. ఇది మొదలు వారికి చేసే జపతపాలకు, పూజలకు విశేష ఫలితాలు కలుగుతాయని శాస్ర్తాలు చెబుతున్నాయి. కొందరు ‘అమావాస్య’ అంటేనే ఏదో అపవిత్రమని భయపడిపోతారు. కానీ, ఇది అత్యంత శక్తివంతమైన తిథి. ముఖ్యంగా చుక్కల అమావాస్య రోజు దానధర్మాలు చేయడం వల్ల పితృదేవతల ఆత్మలు శాంతించి, అనుగ్రహిస్తారన్న నమ్మకం బలంగా ఉంది.
(The above story first appeared on LatestLY on Jul 27, 2022 10:36 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

