ఈ ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ 16(శనివారం)వచ్చింది. హనుమంతుడి జయంతికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. ఉపవాసం ఉంటారు. ఈ రోజున హనుమంతుడిని పూజించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. హనుమాన్ జయంతి సందర్భంగా.. మీరు మీ రాశిచక్రం ప్రకారం ( హనుమాన్ జయంతి 2022 ) దేవునికి ఏ రకమైన ప్రసాదం సమర్పించాలీ.. ఏ ప్రసాదం సమర్పిస్తే.. కోరిన కోర్కెలు తీరడమే కాదు.. విజయం మీ సొంతం అవుతుందో ఈరోజు తెలుసుకుందాం.. హనుమంతికి జయంతి కి ఉపవాసం చేయాలనుకునేవారు వారు.. ముందు రోజు రాత్రి నేలపై నిదురించాల్సి ఉంది. రాముడు, సీతాదేవి , హనుమంతుడిని ప్రార్థించండి.
>> హనుమాన్ జయంతి నాడు తెల్లవారు జామునే నిద్ర లేచి అభ్యంగ స్నానం శుభ్రమైన బట్టలు ధరించండి.
>> చేతిలో నీరు తీసుకుని ఉపవాస ప్రమాణం చేయండి.
>> అనంతరం పూజ గదిలో హనుమంతుడి పటం దగ్గర పూజ ఏర్పాటు చేసుకోండి
>> పూజ కోసం, తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం పెట్టండి.
>>హనుమాన్ చాలీసా చదవండి. హనుమంతుడిని ప్రార్థించండి.
ఏ రాశివారు ఏ విధమైన ప్రసాదం సమర్పించాలంటే..
మేషరాశి: ఈ రాశి వారు హనుమంతునికి శనగపిండి లడ్డూలను సమర్పించాలి.
వృషభం: ఈ రాశి వారు హనుమాన్ జయంతి నాడు తులసి విత్తనాలను సమర్పించాలి.
మిధున రాశి: ఈ రాశి వారు హనుమంతుని పూజించేటప్పుడు తులసి ఆకులను సమర్పించాలి.
కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు ఆవు నెయ్యితో చేసిన శెనగపిండిని నైవేద్యంగా సమర్పించాలి.
సింహరాశి : ఈ రాశి వారు హనుమంతునికి జిలేబీని సమర్పించాలి.
కన్య రాశి: ఈ రాశి వారు దేవునికి వెండి రేకుతో ఉన్న స్వీట్లను సమర్పించాలి.
తుల రాశి: ఈ రాశివారు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
వృశ్చిక రాశి: ఈ రాశివారు ఆవు నెయ్యితో చేసిన శెనగపిండి లడ్డూలను నైవేద్యంగా సమర్పించాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు హనుమాన్ జయంతి నాడు లడ్డూ, తులసి ఆకులను నైవేద్యంగా పెట్టాలి.
మకరరాశి : ఈ రాశి వారు మోతీచూర్ లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు హనుమాన్ జయంతి నాడు ఎర్రటి వస్త్రం , లడ్డూలను సమర్పించాలి.
మీన రాశి: ఈ రాశివారు హనుమాన్ జయంతి రోజున లవంగాలు సమర్పించాలి.