Horoscope 21 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు రోడ్డుపై వేగంగా ప్రయాణించొద్దు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

Horoscope 21 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు రోడ్డుపై వేగంగా ప్రయాణించొద్దు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
(Photo Credits: Flickr)

మేషం

నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాలు గూర్చి చర్చిస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నవి. వృత్తి వ్యాపారాలు లాభాలబాటలో సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు.

వృషభం

చేపట్టిన పనులలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధుమిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఉంటుంది. శత్రు సంభందమైన సమస్యలు నుండి ఉపశమనం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన అవకాశాలు అందుకుంటారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం-2022, ఈ ఏడాది మానవత్వం కోసం యోగా స్లోగన్‌ను నిర్వహించనున్న ఆయుష్ మంత్రిత్వ శాఖ

మిధునం

నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఇతరులతో మాటపట్టింపులు ఉంటాయి. దూరప్రయాణాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది.

కర్కాటకం

నూతన ఋణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటా బయటా అదనపు బాధ్యతల వలన చికాకు పెరుగుతుంది మానసిక అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. బంధుమిత్రులతో స్పల్ప మాట పట్టింపులుంటాయి. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఆకస్మిక స్థానచలన సూచనలున్నవి.

సింహం

ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్నివైపుల నుండి ఆదాయం అందుతుంది వ్యాపార విస్తరణకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వృత్తి, ఉద్యోగాలు ఆశించిన విధంగా రాణిస్తాయి ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.

కన్య

ముఖ్యమైన వ్యవహారాలు కొంత నిదానంగా పూర్తవుతాయి. అవసరానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. కీలక విషయాలలో ద్విస్వభావ ఆలోచనలు చెయ్యడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తప్పవు. నిరుద్యోగులకు కొన్ని విషయాలలో నిరాశ పెరుగుతుంది.

తుల

ఇంటా బయట మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థికవ్యవహారాలు సంతృప్తి కలిగిస్తాయి. స్నేహితుల నుండి ఊహించని సహాయం అందుతుంది. నూతన వ్యాపారాల్లో మరింత పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

వృశ్చికం

ఆర్ధిక విషయంలో లోటుపాట్లు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిదికాదు. నిరుద్యోగులు కొంత ఓర్పుతో ప్రయత్నాలు చేయాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి.

ధనస్సు

ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. భూ సంబంధిత వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు. వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

మకరం

సమాజంలో ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.ధనపరంగా అనుకూల వాతావరణం ఉంటుంది దైవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి.

కుంభం

చేపట్టిన వ్యవహారాలలో ప్రతికూల వాతావరణం ఉంటుంది దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది గృహమున కొందరి ప్రవర్తన మానసికంగా చికాకు కలిగిస్తుంది జీవితభాగస్వామితో పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందిపడతారు వ్యాపారమున ఆర్ధిక ఇబ్బందులు కలుగుతాయి.

మీనం

ఆర్ధిక ఇబ్బందులు బాధిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి. వాహనప్రయాణలలో అప్రమత్తంగా వ్యవహరించాలి వ్యాపారాలలో ఒడిదుడుకులు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

(The above story first appeared on LatestLY on Jun 21, 2022 01:56 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).