Horoscope 28 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.

Horoscope 28 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
(Photo Credits: Flickr)

మేష రాశి

ఈ రాశివారు నేడు ముఖ్యమైన ఆహ్వానం అందుకుంటారు. మీరుండే చోటుకు మీ పైఅధికారిని, సీనియర్లను ఆహ్వానించడానికి ఈ రోజు మంచి రోజు కాదు. డబ్బులు అకస్మాత్తుగా రావడంతో బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి.

వృషభ రాశి

దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి విముక్తి పొందుతారు. పాత పెట్టుబడులకు లాభదాయకమైన డబ్బులు వస్తాయి. మీకు కావాల్సినవారు మీకు సమయం ఇవ్వరు. మీ జీవిత భాగస్వామి విషయంలో ఈ రోజు ఇబ్బందులు పడతారు.

మిథున రాశి

ఓ స్నేహితుడి ప్రవర్తన వల్ల ఇబ్బంది కలుగుతుంది. చిన్నపిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. ఇంటర్వ్యూలకు వెళ్లడానికి ఈ రాశివారికి ఇవాళ మంచి రోజు. ఆధ్యాత్మిక పుస్తకాలను ఖాళీ సమయాల్లో చదువుతారు.

కర్కాటక రాశి

ఇంటి పని చాలా అలసటను కలిగిస్తుంది. మీకు, మీ ప్రియమైన వారి మధ్య మూడో వ్యక్తి జోక్యం చేసుకోవడం ద్వారా ఇబ్బందులకు గురవుతారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు ఫైనల్ దశకు చేరతాయి. మీ జీవిత భాగస్వామి వల్ల మీకు ఇబ్బందులు కలగవచ్చు.

సింహ రాశి

పెళ్లైన వారు పిల్లల చదువులకు డబ్బును వెచ్చించాల్సి ఉంటుంది. ఈ రాశివారికి ఈ రోజు పనివిషయంలో అన్ని సానుకూలంగా జరుగుతాయి. మీ దగ్గరి వారు మీకు మరింతగా దగ్గరవుతారు. వైవాహిక జీవితానికి సంబంధించి సర్‌ప్రైజ్‌ను అందుకుంటారు.

కన్యా రాశి

ఈ రాశివారికి ఈ రోజు వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తాయి. పెళ్లైన వారు తమ ధనాన్ని పిల్లల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీ భాగస్వామి నుంచి ఈ రోజు మంచి వార్తను తెలుసుకుంటారు.

తులా రాశి

ఆర్థిక సమస్యలు టెన్షన్ పెడతాయి. వ్యాపారం చేసేవారు నష్టాలను మూటకట్టుకుంటారు. వ్యాపారం అభివృద్ధి చేసేందుకు డబ్బులు ఖర్చు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు సమయం దొరుకుతుంది.

వృశ్చిక రాశి

మీ ప్రవర్తన ఈ రోజు అందరినీ ఆకర్షిస్తుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిలు చేతికి అందుతాయి. మీ కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. నిర్దేశించిన సమయం కంటే ఇవాళ మీ పనులను త్వరగా పూర్తి చేస్తారు. మీ జీవిత భాగస్వామి చర్య వల్ల ఈ రాశివారు ఇవాళ ఇబ్బందులు పడవచ్చు.

ధనస్సు రాశి

చిన్న చిన్న విషయాలకు చిరాకు పడతారు. మీకు బాగా ఇష్టమైన వారి దగ్గర నుంచి కాల్ వస్తుంది. మీ భాగస్వామి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.

మకర రాశి

కొద్దికాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు ఈ రోజు చెల్లిస్తారు. మీ సమీప బంధువు నుంచి మంచి వార్త వింటారు. వైవాహిక జీవితానికి సంబంధించి అద్భుతమైన సర్‌ప్రైజ్‌ను అందుకుంటారు.

కుంభ రాశి

స్నేహితులు చేసే కొన్ని పనుల వల్ల చికాకుకు గురవుతారు. వివాహబంధంలోకి అడుగుపెట్టడానికి ఈ రాశివారికి ఈ రోజు మంచి సమయం. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులు చివరి దశకు చేరతాయి. మీరు చెప్పే విషయాల వల్ల కుటుంబసభ్యులు బాధపడతారు. మీ జీవిత భాగస్వామి వల్ల ఇబ్బందులు రావచ్చు.

మీన రాశి

అనుకోని అతిధి మీ ఇంటికి వస్తారు. మీ డబ్బును ఇంటి అవసరాల కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాత స్నేహితులు కలుస్తారు. ఉద్యోగస్తులు ఆఫీసుల్లో జాగ్రత్తగా ఉండాలి.

(The above story first appeared on LatestLY on Jun 28, 2022 12:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).