Horoscope Today 12 June 2022, Astrology: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశివారు వివాదాల జోలికి వెళ్లవద్దు, ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయవద్దు, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..

సోదరులతో స్థిరస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

Horoscope Today 12 June 2022, Astrology: ఆదివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు ఈ రాశివారు వివాదాల జోలికి వెళ్లవద్దు, ఈ రాశి వారు దూర ప్రయాణాలు చేయవద్దు, మీ రాశి ఫలితం వెంటనే చెక్ చేసుకోండి..
(Photo Credits: Flickr)

మేషం

సోదరులతో స్థిరస్తి వివాదాలు తీరతాయి. విలువైన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

వృషభం

నూతన పనులకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

మిధునం

చేపట్టిన పనులలో కష్టమే తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. బందు మిత్రులతో విభేదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు తప్పవు.

కర్కాటకం

చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. సోదరులతో కలహా సూచనలున్నవి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి ఉద్యోగమున శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

సింహం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి, సంతానానికి విద్య, ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

Telangana Govt Jobs 2022: నిరుద్యోగులకు మరో శుభవార్త, 1,433 పోస్టులకు తెలంగాణ ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌, త్వరలో ఈ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల  

కన్య

నూతన రుణయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

తుల

చిరకాల శత్రువులుకూడా మిత్రులుగా మారి సహాయపడతారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చేపట్టిన పనులు చకచకా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి.

వృశ్చికం

ముఖ్యమైన కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ విషయంలో ఆకస్మికంగా నిర్ణయాలలో మార్పులు చేస్తారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువర్గంతో తగాదాలు ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.

ధనస్సు

ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

మకరం

గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై శ్రద్ద పెరుగుతుంది. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

కుంభం

ఆప్తుల నుండి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమౌతాయి. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. కోర్టు కేసులు రాజి అవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.

మీనం

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు ఉంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. సోదరులతో ఆస్తి విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు ఉంటాయి.

(The above story first appeared on LatestLY on Jun 12, 2022 10:42 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).