Horoscope Today 2 June 2022: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Horoscope Today 2 June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే జూన్ 2న గ్రహాల సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైనది. గురువారం మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, మీ నేటి అంచనాను తెలుసుకోండి.

Horoscope Today 2 June 2022: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
(Photo Credits: Flickr)

Horoscope Today 2 June 2022:  జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే జూన్ 2న గ్రహాల సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైనది. గురువారం మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, మీ నేటి అంచనాను తెలుసుకోండి.

మేషం

వృత్తి, వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలిసిరావు. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఇంటాబయట మానసిక సమస్యలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.

వృషభం

చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి ఋణ ఒత్తిడి నుండి బయటపడతారు.

మిధునం

ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. అనుకున్న పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఉద్యోగాలలో శ్రమకు తగిన గుర్తింపు లభించదు.

కర్కాటకం

వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది సన్నిహితుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి లభిస్తుంది. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

What Is Elinati Shani Effect: ఏలినాటి శని అంటే ఏంటో తెలుసా, శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఈ తప్పు చేస్తే ఏడున్నరేళ్లు శని వదలకుండా పట్టి పీడిస్తుంది..

సింహం

బంధు మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఆలోచనలు అమలు పరుస్తారు. ఉద్యోగస్తులకు పనిఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది.

కన్య

చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలున్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వ్యాపారాలు అంతంతమాత్రంగా సాగుతాయి ఉద్యోగ వాతావరణం చికాకుగా ఉంటుంది.

తుల

ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలలో నిలకడ లోపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులకు ప్రయత్నాలు ఫలించవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.

వృశ్చికం

నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనస్సు

ఆలోచనలు ఆచరణలో పెడతారు.గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. మానసిక ప్రశాంతత కలుగుతుంది చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహంతో ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

మకరం

బంధు వర్గం వారితో విభేదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. అనుకున్న సమయానికి డబ్బు చేతికి అందక ఇబ్బంది కలుగుతుంది.

కుంభం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఖర్చుల విషయంలో ఆలోచించి వ్యవహరించడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలు కలిసిరావు. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఋణ ఒత్తిడి పెరుగుతుంది.

మీనం

సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

(The above story first appeared on LatestLY on Jun 02, 2022 11:22 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).