Horoscope Today 30 April 2022: శనివారం ఈ రాశులవారికి అనుకోని ధనలాభం కలిసి వస్తుంది, ఈ రాశుల వారికి శుభవార్తలు వింటారు, నిరుద్యోగులకు ఉద్యోగం దక్కే అవకాశం, మీ రాశి ఉందేమో చూసుకోండి.
Horoscope Today 30 April 2022: శనివారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. శనివారం నాడు సింహ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు, తుల రాశికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల మొండితనాన్ని అరికట్టాలి.
Horoscope Today 30 April 2022: శనివారం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. శనివారం నాడు సింహ రాశి వారు ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మరోవైపు, తుల రాశికి చెందిన తల్లిదండ్రులు తమ పిల్లల మొండితనాన్ని అరికట్టాలి.
మేషం
ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులు తో గృహమున ఆనందంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు అందుతాయి.
వృషభం
నిరుద్యోగులకు ఊహించని విధంగా లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. చేపట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో ఉన్న వివాదాలను శృతిమించకుండా జాగ్రత్త వహించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మిధునం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యులతో కష్టసుఖాలు విచారిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇతరుల నుండి సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. ఆర్ధిక వాతావరణం ప్రతికూలంగా ఉంటుంది. వాహన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించాలి.
కర్కాటకం
వృత్తి వ్యాపారాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.సోదరులతో భూ వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. కీలక వ్యవహారాల్లో జీవితభాగస్వామి సలహాలు తీసుకుంటారు. ఉద్యోగమున అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది.
సింహం
దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి ప్రారంభించిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ అధిగమించి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. ఉద్యోగార్థులకు ఉన్నతావకాశములు లభిస్తాయి.
కన్య
ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు మరింత అనుకూల పరిస్థితులుంటాయి. సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
తుల
స్థిరాస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వృత్తి వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలుచేసి ఇబ్బందులకుగురిఅవుతారు. ఉద్యోగవాతావరణం గందరగోళంగా ఉంటుంది.
వృశ్చికం
ముఖ్యమైన వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి ఇంటా బయట శాంతంగా వ్యవహరించాలి.
ధనస్సు
వ్యాపార వ్యవహారాలలో సొంత నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. దీర్ఘకాలిక సమస్యలు కొంత మానసికంగా ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయం వలన కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు మరింత కష్టంతో గానీ ఫలితం లభించదు.
మకరం
ధనదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరట చెందుతారు. దూర ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. జీవిత బాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగమున పరిస్థితులు సంతృప్తి కలిగిస్తాయి.
కుంభం
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది దూర ప్రాంతాల బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. నూతన వాహన యోగం ఉన్నది. నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు.
మీనం
పనులు సకాలంలో పూర్తి కాకా చికాకు కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగ విషయమై చెయ్యని పనికి నిందలు పడతారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.
(The above story first appeared on LatestLY on Apr 29, 2022 10:27 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

