Horoscope Today 6 May 2022: శుక్రవారం ఈ రాశుల వారికి వ్యాపారంలో శుభవార్తలు, ఈ రాశుల వారికి ఉద్యోగ ఇంటర్వ్యూలో విజయం, ఈ రాశుల వారు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
శుక్రవారం కొన్ని రాశుల వారికి విజయవంతమైన రోజు కానుంది. శుక్రవారం నాడు, సింహ రాశి ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రణాళిక అవసరం. మరోవైపు, తుల రాశి ఉన్నవారు కార్యాలయంలో కొత్త బాధ్యతను పొందవచ్చు.
శుక్రవారం కొన్ని రాశుల వారికి విజయవంతమైన రోజు కానుంది. శుక్రవారం నాడు, సింహ రాశి ఉన్న వ్యక్తులు తమ వ్యాపారాన్ని నిర్వహించడానికి ప్రణాళిక అవసరం. మరోవైపు, తుల రాశి ఉన్నవారు కార్యాలయంలో కొత్త బాధ్యతను పొందవచ్చు.
మేషం : ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. ఇంటాబయట బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు గృహమున ఆప్తుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారమున లాభాలు అందుకుంటారు.
వృషభం : ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో తీసుకున్న నిర్ణయాలు మానసికంగా ఆనందం కలిగిస్తాయి వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక అనుకూలత కలుగుతుంది.
మిధునం: సోదరులతో శుభకార్యాలు గూర్చి చర్చిస్తారు దూరప్రాంత బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది.
కర్కాటకం: చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. అనారోగ్య సమస్యల నుండి బయట పడతారు. జీవిత భాగస్వామి నుండి శుభవార్తలు అందుతాయి. ఇంటా బయట ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంత వరకు తొలగుతాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వస్త్ర వస్తు లాభాలు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి మన్ననలు పొందుతారు.
కన్య: మిత్రుల నుండి అవసరానికి ధన సహాయం లభిస్తుంది చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వ్యాపారాలు లాభిస్తాయి.
తుల: ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భాగస్వామ్య వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిదికాదు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి.
వృశ్చికం: నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. జీవిత భాగస్వామి నుండి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.
ధనస్సు: ఇంటాబయట సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మకరం: దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు.బంధు మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సహోద్యోగుల నుండి శుభవార్తలు అందుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.
కుంభం: మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. భూ సంభందిత క్రయవిక్రయాల్లో లాభాలు అందుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్య వ్యవహారంలో ఆర్థిక సాయం అందుతుంది. ఉద్యోగమున అధికారులతో చర్చలు అధిగమిస్తారు.
మీనం: గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు కలసివస్తాయి. స్ధిరాస్తి విషయంలో సోదరులతో నూతన ఒప్పందాలు కుదురుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు కలుగుతాయి. వాహన యోగం ఉన్నది. వృత్తి ఉద్యోగాలలో సమయ పాలనతో పనులు పూర్తి చేస్తారు.
(The above story first appeared on LatestLY on May 05, 2022 11:56 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

