Horoscope Today: ఈ రోజు ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోండి.. ఆగస్టు 14 రాశిఫలాలు ఇవిగో..
గ్రహాల గమనం, నక్షత్రాల బలం ఆధారంగా ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ సౌఖ్యం విషయాల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఎవరికి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
గ్రహాల గమనం, నక్షత్రాల బలం ఆధారంగా ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు కుటుంబ సౌఖ్యం విషయాల్లో ఏ రాశి వారికి అనుకూలంగా ఉంది? ఎవరికి ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి? ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే పూర్తి వివరాలు మీ కోసం:
మేషం (Aries): అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఎదురైనా చివరకు సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం వేచిచూస్తారు. దైవదర్శనం లభిస్తుంది.
వృషభం (Taurus): బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. కొద్దిపాటి మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
నేటి రాశి ఫలాలు: ఈ రాశుల వారికి ఆర్థికంగా కలిసొచ్చే రోజు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
మిథునం (Gemini): నూతన వస్తు, వస్త్ర, వాహన మరియు ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంది. కీలకమైన శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది.
కర్కాటకం (Cancer): వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల చేపట్టిన పనులు చెడిపోయే ప్రమాదం ఉంది. చెడును కోరేవారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహించవచ్చు. శారీరక బలహీనత వేధిస్తుంది.
సింహం (Leo): విదేశీయాన ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. కొద్దిపాటి మనోవిచారానికి గురవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం జరిగే సూచనలు ఉన్నందున జాగ్రత్త పడాలి. నూతన కార్యాలను వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.
కన్య (Virgo): తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకుంటారు. బంధుమిత్రుల గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది. సహ ఉద్యోగులకు సహాయం చేసే అవకాశం వస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉండి, అంతటా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
తుల (Libra): శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. ఆనందాన్నిచ్చే శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఉత్సాహంగా ఉంటారు. ప్రయత్నించే ప్రతీ పనిలోనూ విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం (Scorpio): కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులు కొంత సతమతం చేస్తాయి. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండటమే మంచిది. ఆత్మీయుల సహాయ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది.
ధనుస్సు (Sagittarius): వృత్తి, ఉద్యోగ రంగాల్లో అనుకున్న అభివృద్ధి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే పనులు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.
మకరం (Capricorn): అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటి వాతావరణంలో మార్పులు కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. నిర్ణయాల్లో స్థిరత్వం లోపిస్తుంది. ఆకస్మిక ధనవ్యయం కావచ్చు. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. రుణప్రయత్నాలు చేస్తారు.
కుంభం (Aquarius): నూతన వస్తువులు, వస్త్రాలు, ఆభరణాలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం కలగొచ్చు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోద కార్యక్రమాలు, చర్చలు మరియు సదస్సులు మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. పరిపూర్ణ మనోధైర్యంతో ఉంటారు. శుభవార్తలు వింటారు.
మీనం (Pisces): ఆకస్మిక ధనలాభ యోగం ఉంది. కుటుంబంలో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. పేరుప్రతిష్ఠలతో పాటు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. ఆత్మీయులైన బంధుమిత్రులను కలుసుకుంటారు.
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

