Horoscope Today, July 23, 2026: ఈ రోజు రాశిఫలాలు, జూలై 23 గురువారం మీ రాశి ఫలితం ఎలా ఉంది.. అదృష్టం కలిసి వచ్చే రాశులు ఇవే..
Horoscope Today, July 23, 2026: జ్యోతిష్య శాస్త్రాన్ని విశేషంగా నమ్మే వేలాది మంది ప్రతిరోజూ తమ నక్షత్ర బలం, గ్రహ స్థితులను బట్టి సమయాన్ని ప్రణాళిక చేసుకుంటుంటారు. నేటి గ్రహాల కదలికలు, ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో పూర్తి వివరాలు చూద్దాం.
Horoscope Today, July 23, 2026: జ్యోతిష్య శాస్త్రాన్ని విశేషంగా నమ్మే వేలాది మంది ప్రతిరోజూ తమ నక్షత్ర బలం, గ్రహ స్థితులను బట్టి సమయాన్ని ప్రణాళిక చేసుకుంటుంటారు. నేటి గ్రహాల కదలికలు, ద్వాదశ రాశుల వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో పూర్తి వివరాలు చూద్దాం.
మేషం: నేడు గృహంలో ప్రతికూల వాతావరణం ఏర్పడే సూచనలు ఉన్నందున ప్రశాంతత కోల్పోకుండా వ్యవహరించాలి. ఆర్థిక ఇబ్బందుల సవాలును తట్టుకోవడానికి అప్పుల కోసం ప్రయత్నిస్తారు. బంధువుల నుంచి ఆశించిన సహాయం కాస్త ఆలస్యంగా అందుతుంది.
కర్కాటకం & సింహం: కర్కాటక రాశి వారికి మనస్సు స్థిరంగా ఉండకపోవడం వల్లఆకస్మిక వివాదాలు ఏర్పడవచ్చు. చెడు అలవాట్లకు, చెడు సావాసాలకు దూరంగా ఉండాలి. మరోవైపు, సింహ రాశి వారికి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఆస్తి తగాదాలు , ఆర్థిక రంగంలో మోసపోయే ముప్పు ఉన్నందున కొత్త నిర్ణయాలు వాయిదా వేయడం శ్రేయస్కరం.
ఈ రోజు రాశిఫలాలు 22 జూలై 2026.. అయస్కాంతంలా ధనాన్ని ఆకర్షించే రాశులు ఇవే!
కన్య & తుల: కన్య రాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఫలించినప్పటికీ, ఊహించని ధననష్టం, అనారోగ్య సమస్యలు వేధించవచ్చు. ఇక తుల రాశి వారు గతం నుంచి వస్తున్న కక్ష సాధింపు ధోరణిని పక్కన పెట్టడం మంచిది. ముఖ్యంగా పిల్లల విషయంలో పట్టుదల వీడాలి.
వృషభం: నిలిచిపోయిన అప్పులు లభించే అవకాశం ఉంది కానీ, కుటుంబంలో శుభకార్యాల వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. స్థానచలనంతో పాటు ప్రయాణాలు అధికమవుతాయి.
మిథునం: స్వల్ప అనారోగ్యాలు ఇబ్బంది పెట్టినా, మీరు చూపించే పట్టుదల వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి. ఉద్యోగ రంగంలో అధికారుల నుంచి తగిన గుర్తింపు లభిస్తుంది.
మకరం, కుంభం & మీనం: ఈ మూడు రాశుల వారికి మానసిక ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. మకరం, కుంభ రాశుల వారు ఆర్థిక ఇబ్బందుల వల్ల అప్పులు చేయాల్సి వస్తుంది. కుంభ రాశి వారికి వృత్తి జీవితంలో పురోగతి ఉన్నప్పటికీ మానసిక ఆందోళన తగ్గదు. మీన రాశి వారికి పాత భయాలు తొలగిపోతాయి కానీ ఉద్యోగంలో ఊహించని మార్పులు లేదా స్థానచలనం ఉండవచ్చు.
వృశ్చికం: నేడు ఈ రాశి వారికి అదృష్టం కలిసి రానుంది. ఆకస్మిక ధనలాభంతో పాటు కుటుంబంలో శుభవార్తలు వింటారు. విందు వినోదాలలో పాల్గొంటూ ఎంతో ఉల్లాసంగా గడుపుతారు.
ధనుస్సు: మీరు సమాజంలో ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు. చాలా కాలంగా వేధిస్తున్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై, అనుకున్న ప్రతి పనిలో విజయం సాధిస్తారు. దైవ దర్శనం లభించడంతో పాటు కొత్త వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
(The above story first appeared on LatestLY on Jul 23, 2026 08:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

