Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు రామ కోటి రాయడం ప్రారంభించండి, ఇలా చేస్తే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, శ్రీరామ కోటి రాయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకోండి...

ఈ రోజు నుంచి రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు నుంచి రామకోటి పుస్తకాన్ని రాయడం చేయాలి.

Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు రామ కోటి రాయడం ప్రారంభించండి, ఇలా చేస్తే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, శ్రీరామ కోటి రాయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకోండి...
Rama-Navami-2022-Wishes-in-Telugu_2

శ్రీ రామ నవమి ఏటా వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటారు. ఎందుకంటే ఇదే రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీ రాముడు జన్మించడాని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా రాముడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఇదే రోజు. సీతారాముల కల్యాణం కూడా ఈ రోజునే జరిగిందని ప్రజలు విశ్వసిస్తున్నారు. దేశవ్యాప్తంగా శ్రీ రామ నవమి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

అయితే ఈ రోజు నుంచి రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు నుంచి  రామకోటి పుస్తకాన్ని రాయడం చేయాలి. రామకోటి రాసేందుకు కలం విడిగా పెట్టుకోవడం మంచిది. రామకోటి రాసేటప్పుడు అనవసర చర్చలు, ఇతర వ్యాపకాలు ఉండకూడదు. ఏకాంత ప్రదేశం ఎంచుకోవాలి.

రాసే పుస్తకానికి పసుపు, కుంకుమ రాసి దేవుని సన్నిధిలో ఉంచి పుష్పాలతో పూజించాలి. శ్రీ రామ అష్టోత్తరశతనామావళి చదివి రాయం ప్రారంభించాలి. లక్ష నామాలు రాయటం పూర్తయిన ప్రతిసారీ శక్తి కొలది పూజ, నివేదన చేసి ఆ ప్రసాదాన్ని నలుగురికీ పంచాలి. అలాగే కోటి నామాలు రాసిన తర్వాత కూడా చేయాలి.

అనుకోని కారణాల ద్వారా రాయడం ఆపాల్సి వస్తే.. సరి సంఖ్య వరకు రాసి పుస్తకం మూసి నమస్కరించి వెళ్లాలి. పని పూర్తికాగానే కాళ్ళు, చేతులు కడుక్కొని శుచిగా మళ్ళీ రాయాలి. పూర్తయిన రామకోటి పుస్తకాన్ని పసుపు బట్టలో కట్టి భద్రాచలంలోని రామయ్యకు లేదా ఏదైనా రామాలయంలో అప్పగించాలి. అదీ వీలుకాకుంటే ప్రవహించే నదిలో వదిలిపెట్టాలని పండితులు అంటున్నారు.

(The above story first appeared on LatestLY on Apr 10, 2022 11:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).