రక్షాబంధన్ పండగ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ పండగ హిందువులందరూ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా సోదర సోదరీమణులు తమ అనుబంధానికి గుర్తుగా ఈ రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా సోదరి తన సోదరుడి ఆరోగ్యం కోసం కుటుంబ సంక్షేమం కోసం రాఖీని చేతికి కడుతుంది. ఇందులో కుటుంబ సంబంధాల మధ్య రక్తసంబంధం మధ్య ఉన్నటువంటి మధురమైన జ్ఞాపకానికి చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. అయితే రాఖీ పండగ ఈ సంవత్సరం రెండు రోజులపాటు జరుపుకునేలా తిథి వచ్చింది. దీంతో కొద్దిమంది ఆగస్టు 30న కొంత జరుపుకోగా మరికొంతమంది ఆగస్టు 31న జరుపుకుంటున్నారు.
రెండు రోజులు పౌర్ణమి ఉండటంతో ఈ విధంగా చేస్తున్నారు. అయితే రాఖీ పండగ రోజున చేయాల్సిన కొన్ని విధులు ఉన్నాయి. ముఖ్యంగా రాఖీ కట్టిన అనంతరం ఒక మంత్రం జపించాలి. ముఖ్యంగా రాఖీ కట్టిన అనంతరం సోదరి ఈ మంత్రం జపించడం ద్వారా సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుందని తద్వారా కుటుంబంలోని కష్టాలన్నీ కూడా తీరిపోతాయని పురాణాల్లో చెబుతున్నారు అలాంటి మంత్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మంత్రం రాఖీ కట్టిన అనంతరం సోదరి చదవాల్సి ఉంటుంది
రాఖీ కట్టిన అనంతరం చదవాల్సిన మంత్రం ఇదే..
యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల"
(The above story first appeared on LatestLY on Aug 28, 2023 06:26 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).