Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్త, ఉద్యోగం పోయే చాన్స్, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..

ఈ ఏడాది ఏయే రాశుల జోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రస్తుతం ఉద్యోగ గండం ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం..

Ugadi Panchangam: శుభకృత నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్త, ఉద్యోగం పోయే చాన్స్, మీరు కూడా ఆ రాశిలో ఉన్నారా చెక్ చేసుకోండి..
(Photo Credits: Flickr)

ఈ ఉగాది పర్వదినాన ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకొని శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. 1962 - 1963 లో వచ్చిన శుభకృత్ మళ్లీ 2022 - 2023లో వస్తోంది. అయితే ఈ ఏడాది ఏయే రాశుల జోతిష్యశాస్త్రం ప్రకారం... ప్రస్తుతం ఉద్యోగ గండం ఉన్న రాశులేంటో ఓసారి చూద్దాం..

1.మేష రాశి..

ఈ రాశివారికి హడావిడి ఎక్కువ. చేసే పనులు.. చెప్పే మాటలు కూడా చాలా హడావిడిగా ఉంటాయి. ఈ క్రమంలో.. వీరు చేసే పనులు పైన బాస్ కి పెద్దగా నచ్చకపోవచ్చు. ఈ క్రమంలో ఉద్యోగం పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశివారు.. తమకు నచ్చినదే మాట్లాడతారు. దీంతో.. అది వారిపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది.

2.వృషభ రాశి..

ఈ రాశివారు చాలా మొండిగా ఉంటారు. వారు ఏదైనా సరైనదని భావిస్తే.. వారు తమ నిర్ణయానికి మాత్రమే కట్టుబడి ఉంటారు. కనీసం తమ ఉన్నతాధికారులు చెప్పే విషయాన్ని కూడా వినరు. ఈ క్రమంలో.. వారిని ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

3.మిథున రాశి..

ఈ రాశివారు కొంచెం పెడసరి తనం ఎక్కువ. ఎదుటివారు చెప్పేది వినరు. దాని గురించి పెద్దగా ఆలోచించరు. చాలా పరుశంగా మాట్లాడతారు. వీరు మాట్లాడే మాటలు.. సహోద్యోగులకు, ఉన్నతాధికారులకు నచ్చకపోవచ్చు. దీంతో... వీరు ఎవరికీ పెద్దగా నచ్చరు.

4.సింహ రాశి..

సింహ రాశివారికి పరిస్థితికి తగినట్లుగా ఉండటం రాదు. అన్ని సందర్భాల్లోనూ కోపంగానే ఉంటారు. ఈ క్రమంలో వీరికి ఆఫీసుల్లో శత్రువులు ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. వీరిని టీమ్ లో ఉంచుకోవడానికి కూడా ఎవరూ అంగీకరించరు. దీంతో.. వీరిని తొందరగా ఉద్యోగం నుంచి తొలగించే అవకాశం ఉంటుంది.

(The above story first appeared on LatestLY on Apr 03, 2022 03:14 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).