Blood Pressure Controlling Foods: బీపీని నార్మల్ చేసే ఆహారాలు ఇవే, ప్రతిరోజు వీటిని మీ ఆహారంలో చేర్చితే జరిగే లాభాలు ఇవే, ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి...

బీపీ సాధారణ జీవనశైలిలో వచ్చే స్వల్ప మార్పు. బీపీ పెరుగుతోందని కంగారు పడకుండా రక్తపోటును అదుపులో ఉంచేందుకు కొన్ని ఇంటి చిట్కాలు పాటించి చూడండి.

Blood Pressure Controlling Foods: బీపీని నార్మల్ చేసే ఆహారాలు ఇవే, ప్రతిరోజు వీటిని మీ ఆహారంలో చేర్చితే జరిగే లాభాలు ఇవే, ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేయండి...
Immunity Boosting Food (Photo Credits: Pixabay)

బీపీ (బ్లడ్ ప్రెషర్) కంట్రోల్‌లో ఉంచుకోకపోతే దానివల్ల శరీరంలోని మిగతా అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అందుకే డాక్టర్లు పదే పదే చెబుతుంటారు.. రక్తపోటును అశ్రద్ధ చేయవద్దు అని.  హోం రెమెడీస్ అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. బీపీ సాధారణ జీవనశైలిలో వచ్చే స్వల్ప మార్పు. బీపీ పెరుగుతోందని కంగారు పడకుండా రక్తపోటును అదుపులో ఉంచేందుకు కొన్ని ఇంటి చిట్కాలు పాటించి చూడండి. రక్తపోటు అనేది చాలా మంది సీనియర్ సిటిజన్లను బాధించే కార్డియోవాస్కులర్ డిసీజ్. అయితే ఇప్పుడు యువ తరం కూడా బీపీతో బాధపడుతోంది. ఈ వ్యాధికి శాశ్వత నివారణ లేనప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అదుపులో ఉంచవచ్చు. అధిక రక్తపోటు ఉన్నవారు తాము తినే ఆహారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. మసాలా ఆహారం, ఉప్పు, ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు అధికంగా ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆరోగ్య సంబంధిత జర్నల్స్ ప్రకారం ఆహారంలో మార్పులు రక్తపోటును తగ్గిస్తాయి, రక్తపోటు అభివృద్ధిని నిరోధిస్తాయి.. రక్తపోటు సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. హైపర్ టెన్షన్ నివారణకు ఆహారంలో సోడియం తీసుకోవడం తగ్గించాలి. ఆల్కహాల్ వినియోగాన్ని పరిమితం చేయడం, పొటాషియం తీసుకోవడం పెంచడం చేయాలి. కాబట్టి, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, రక్తపోటును నిర్వహించడానికి సహాయపడే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి..

>> అవిసె గింజలను తినాలి. ఎందుకంటే ఇందులో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు హై బీపీ ని కంట్రోల్ చేస్తాయి.

>> రోజు ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే హైబీపీ తో పాటు మన లోని కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

>> ప్రతిరోజు దాల్చిన చెక్క పొడిని ఒక టీ స్పూన్ తీసుకుంటే హైబీపీ తో పాటు పిసిఓడి కూడా తగ్గుతుంది.

>> దాల్చిన చెక్క తీసుకోవడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు

>> ప్రతిరోజు తప్పకుండా యాలకులను తీసుకోవాలి.

>> దీనివలన డయాబెటిస్ సమస్యలు కూడా తగ్గుతాయి.

(The above story first appeared on LatestLY on Dec 27, 2021 05:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).