Tomato Side Effects: టమాట ఎడా పెడా తినేస్తున్నారా, అయితే జాగ్రత్త, కిడ్నీలకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్న నిపుణులు,
మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టొమాటోను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టొమాటను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మనం ఇంట్లో వండుకునే ప్రధానమైన కూరగాయాల్లో టొమాటకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది లేకుంటే కొందరికి భోజనం చేసినట్టు కూడా అనిపించదు. కర్రీలు, ఫ్రైలు, నాన్ వెజ్ ఐటమ్స్‌లో కూడా టొమాటో లేదా దాని గుజ్జును అధికంగా వినియోగిస్తుంటారు. ఇక బయట రెస్టారెంట్లు, బేకరీల్లో టొమాటో సాస్ తప్పనిసరి అయిపోయింది. కర్రీల్లో గ్రేవీ , టెస్ట్ కోసం టొమాటోను కొందరు అధికంగా వినియోగిస్తుంటారు. టొమాట చూసేందుకు ఎరుపుగా కళ్ల నిండా ఆకర్షిస్తుంది. శరీర డైట్ మెయింటెన్ చేసేవారు పచ్చి టమాటాలను కూడా తింటుంటారు. అయితే, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు టొమాటో ఎక్కువగా తీసుకుంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
సాధారణంగా మనం ఇంట్లో టొమాటోను అధికంగా వినియోగిస్తుంటాము. కూరలు, సూప్స్ కోసం విరివిగా వాడుతుంటాము. అయితే టొమాటోను ఎక్కువగా తినడం వలన మూత్రపిండాల్లో రాళ్ల సంఖ్య పెరుగుతుందని, లేనివారికి కొత్తగా వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టొమాటోను ఆగ్జాలిన్ అనే పదార్థం ఉంటుంది. ఇందులో విటమిన్స్, కాల్షియంతో పాటు ఆగ్జాలిన్ అనేది మన బాడీలోని యూరిక్ యాసిడ్‌తో కలిసినప్పుడు చెడు జరిగే అవకాశం ఉంది. ఆగ్జాలిన్‌ను యూరిక్ యాసిడ్ శోషించుకోవడం వలన కిడ్నీల్లో చిన్నగా రాళ్లలాగా ఏర్పడుతాయి. క్రమంగా ఇవి పెద్దగా అవ్వడం ద్వారా మూత్రానికి అడ్డుగా ఉంటాయి.
దీంతో మూత్రం పోసేటప్పుడు విపరీతమైన మంట, నొప్పికలుగుతాయి. వీటిని తొలగించకపోతే శరీరంలో నీటి స్థాయి పెరిగి అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. కొంతకాలానికి కిడ్నీలు చెడిపోయే ప్రమాదం లేకపోలేదు. అందుకే మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారు టొమాటోను తక్కువగా తీసుకోవాలి. బీపీ, డయాబెటీస్ వ్యాధితో బాధపడేవారు కూడా టొమాటను తక్కువగా తీసుకుంటే మంచిదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీల్లో రాళ్లు రావడానికి లేదా వాటి ఎదుగుదలకు ఆగ్జాలిన్ అనేది చాలా ప్రోత్సహిస్తుంది.
(The above story first appeared on LatestLY on Jan 20, 2022 03:23 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

