Cancer and Sleep: నైట్ షిఫ్టులు అంటూ సరిగ్గా నిద్రపోవడం లేదా, అయితే క్యాన్సర్ వచ్చే చాన్స్ అధికం, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ వాస్తవాలు...

రాత్రి నిద్ర శరీరానికి ముఖ్యం. కానీ.. నైట్ షిఫ్టుల ఉద్యోగం అంత శ్రేయస్కరం కాదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని ఊటంకిస్తున్నాయి. ఏకంగా క్యాన్సర్ కు దారి తీయొచ్చని చెప్తున్నాయి.

Cancer and Sleep: నైట్ షిఫ్టులు అంటూ సరిగ్గా నిద్రపోవడం లేదా, అయితే క్యాన్సర్ వచ్చే చాన్స్ అధికం, వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధనలో బయటపడ్డ వాస్తవాలు...
The Surprising Risks of Sleeping Too Much ( Photo-File Image)

రాత్రి నిద్ర శరీరానికి ముఖ్యం. కానీ.. నైట్ షిఫ్టుల ఉద్యోగం అంత శ్రేయస్కరం కాదనే విషయం వెలుగులోకి వచ్చింది. వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీలో చేసిన కొన్ని పరిశోధనలు ఇదే విషయాన్ని ఊటంకిస్తున్నాయి. ఏకంగా క్యాన్సర్ కు దారి తీయొచ్చని చెప్తున్నాయి. శరీరంలోని జన్యువులు దీర్ఘకాలంలో క్యాన్సర్ కు దారి తీస్తాయని అంటున్నారు. డీఎన్ఏ కూడా ఈ ముప్పును ఎదుర్కోవడంలో విఫలమవుతున్నాయని చెప్తున్నారు.

కొందరు ఆరోగ్యవంతులైన వాలంటీర్లలో పగలు, రాత్రిళ్లు పని చేసేవారిపై ఈ పరిశోధనలు చేసినట్టు తెలిపారు. నైట్ షిఫ్ట్స్ లో పని చేసేవారిలో క్యాన్సర్ ఎక్కువగా ఉందని ఆధారాలు ఉన్నాయంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సైతం దీని గురించి చెప్తోంది. మెదడులో ప్రత్యేకంగా క్లాక్ జీన్స్ ఉన్నా కేంద్ర శరీరంలోని దాదాపు ప్రతి కణానికి కూడా అంతర్భాగంలో క్లాక్ జీన్స్ అనే జన్యువులు ఉంటాయి. ఇవి లయబద్ధంగా ఉండటంతో వాటి పనితీరు పగలు, రాత్రివేళల్లో మారుతూ ఉంటుంది. అలాగే క్యాన్సర్ సంబంధ జన్యువుల కదలికలు ఉంటాయని అంటున్నారు. దీనివల్లే రాత్రిళ్లు పని చేసే సమయంలో జన్యువులు కదలికలకు భంగం కలిగే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. దీనిని నిర్ధారించేందుకే షిఫ్ట్ వర్క్ పై ప్రయోగాలు చేశారు. ఇందులో 14 మంది పాల్గొన్నారు.

యుక్రెయిన్‌ లో మరో పెను ప్రమాదం, రష్యా దాడుల్లో యూరప్ అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం, ఏ క్షణమైనా ముప్పువాటిల్లే అవకాశం

వీరు డబ్ల్యూహెల్త్ సైన్సెస్ స్పోకనేలోని స్లీప్ ల్యాబొరేటరీలో ఏడు రోజులు ఉన్నారు. సగం మంది మూడు రోజులు నైట్ షిఫ్ట్ వర్క్, మిగిలిన సగం మూడు రోజులు మార్నింగ్ షిఫ్ట్ వర్క్ లో పనిచేశారు. ఈ క్రమంలో ప్రతి మూడు గంటలకు ఓసారి రక్త నమూనాలు పరీక్షించారు. దీంట్లో పగటిపూట షిఫ్ట్ వర్క్ కంటే రాత్రి షిఫ్ట్ వర్క్ లోనే ఎక్కువ క్యాన్సర్ సంబంధిత జన్యువులు ఉన్నట్టు తేలింది. ఇవన్నీ నైట్ షిఫ్ట్ వర్క్ చేసేవారిపై ప్రభావం చూపాయని.. నిద్ర సరిగా లేక డీఎన్ఏ జన్యువులు లయ తప్పాయని అంటున్నారు. ఈ ప్రయోగాల వల్ల క్యాన్సర్ కారకాలకు సంబంధించి, డీఎన్ఏ కు జరిగే నష్టాన్ని నివారించే ఔషదాలను తయారుచేయొచ్చని అంటున్నారు. ఈ వివరాలన్నీ పినీల్ రీసెర్జ్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

(The above story first appeared on LatestLY on Mar 04, 2022 11:52 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).