JioPhone Next: జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు ప్రారంభం, ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి, రూ.1,999 చెల్లింపుతో సులభమైన ఈఎంఐ ప్లాన్లు
JioPhone Next (Photo Credits: Google)

హైదరాబాద్, 7 నవంబర్ 2021: జియో ఫోన్ నెక్ట్స్ విక్రయాలు భారత్ లో ప్రారంభమయ్యాయి. వీటిని కొనేవారు, స్టోర్ కు వెళ్లడానికి ముందుగా వాట్సాప్ ద్వారా లేదా కంపెనీ వెబ్ సైట్ (https://www.jio.com/next) ద్వారా తమ ఆసక్తిని నమోదు చేసుకోవాలి. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా ఫోన్ కొనేందుకు వీలుండదు. జియో ఫోన్ నెక్ట్స్ కొనుగోలు కోసం రిలయన్స్ ఈఎంఐ ప్లాన్ లను ఆఫర్ చేస్తోంది. దీని వల్ల కొనుగోలుదారులు మొదట రూ.1,999 చెల్లిస్తే సరిపోతుంది.

జియో ఫోన్ నెక్ట్స్ కోసం 70182 70182కు Hi అని వాట్సాప్ చేయడం ద్వారా కూడా కొనుగోలుదారులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సందర్భంగా వినియోగదారులు తమ లొకేషన్ ను షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాత స్టోర్ కు వెళ్లి జియో ఫోన్ నెక్ట్స్ కొనుక్కోవాల్సిందిగా వినియోగదారులకు సమాచారం వస్తుంది. ఈ సమాచారం వచ్చిన తరువాత వినియోగదారులు జియో ఫోన్ నెక్ట్స్ ను కొనేందుకు వీలవుతుంది. ఫోన్ వెల రూ.6,499. వినియోగదారులు సులభ ఈఎంఐ ఆప్షన్ ను ఎంచుకోవచ్చు. ఇందులో వినియోగదారులు మొదటగా రూ.1,999 చెల్లించాలి (రూ.501 ప్రాసెసింగ్ ఫీజు అదనం). మిగిలిన మొత్తాన్ని సులభ నెలవారీ వాయిదాల్లో చెల్లించవచ్చు. ఫోన్ ను తీసుకునేందుకు ఒకటి లేదా రెండు రోజుల తరువాత రావాల్సిందిగా చెప్పే అవకాశం ఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ కు సులభ యాక్సెస్ ఉండేందుకు వీలుగా దేశవ్యాప్తంగా కంపెనీ 30,000కు పైగా రిటైల్ అవుట్ లెట్స్ తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. కాగితపు రహిత డిజిటల్ ఫైనాన్స్ ఆప్షన్ ను కూడా కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది. తద్వారా దీన్ని భౌగోళికంగా ప్రతీ భారతీయుడికీ అందుబాటులోకి తీసుకువచ్చినట్లయింది.

మీకు సమీపంలోని జియో స్టోర్ ను కనుగొనేందుకు లింక్ ను అనుసరించండి.

 

జియో ఫోన్ నెక్ట్స్ కోసం మీరు రూ.1,999 చెల్లిస్తే, మీరు జియో అందించే దిగువ ఈఎంఐ ప్లాన్స్ లో దేన్న యినా ఎంచుకోవచ్చు:

ప్లాన్  ఈఎంఐ  అందించే ప్రయోజనాలు
  ఆల్వేస్ ఆన్ ప్లాన్ నెలకు రూ. 300 చొప్పున 24 నెలలు

నెలకు రూ. 350 చొప్పున  18 నెలలు

నెలకు 5 జిబి డేటా, 100 నిమిషాల కాలింగ్
  లార్జ్ ప్లాన్  నెలకు రూ. 450 చొప్పున 24 నెలలు

నెలకు రూ. 500 చొప్పున  18 నెలలు

 రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్

 

XL ప్లాన్    నెలకు రూ. 500 చొప్పున 24 నెలలు

నెలకు రూ. 550 చొప్పున  18 నెలలు

  రోజుకు 2GB డేటా, అపరిమిత కాలింగ్

 

XXL ప్లాన్ నెలకు రూ. 550 చొప్పున 24 నెలలు

నెలకు రూ. 600 చొప్పున  18 నెలలు

  రోజుకు 2.5GB డేటా, అపరిమిత కాలింగ్

 

 

జియో ఫోన్ నెక్ట్స్ స్పెసిఫికేషన్స్

జియో ఫోన్ నెక్ట్స్ అనేది ప్రగతి ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది. భారతదేశం కోసం తీర్చిదిద్దబడిన ఆండ్రాయిడ్ ఆప్టిమైజ్డ్ వెర్షన్. ఇది 5.45 అంగుళాల హెచ్ డి+ (720x1,440 pixels)  డిస్ ప్లేను కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణ తో వస్తుంది. యాంటీ – ఫింగర్ ప్రింట్ కోటింగ్ ఉంటుంది. కెమెరా వి భాగంలో జియో ఫోన్ నెక్ట్స్ 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరాను, 8-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. రియర్ కెమెరాలో పోట్రాయిట్ మోడ్, నైట్ మోడ్, ప్రి లోడెడ్ కస్టమ్ ఇండియా- అగుమెంటెడ్ రియాలిటీ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫోన్ 1.3 GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 క్వాడ్ – కోర్ ప్రాసెసర్, 2 జిబి ర్యామ్, 512 జీబీ వరకు విస్తరించుకోగలిగిన 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగిఉంటుంది. జియో ఫోన్ నెక్ట్స్ 3,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగిఉంటుంది. మైక్రో – యూఎస్బీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, బ్లూ టూత్ వి4.1, వై-ఫై, డ్యూయల్ సిమ్ (నానో) స్లాట్స్ ఉంటాయి. జియో ఫోన్ నెక్ట్స్ ఆటోమేటిక్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్స్ ను పొందుతుంది. రీడ్ అలౌడ్, లైవ్ ట్రాన్స్ లేట్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ ఉంటాయి.