Lava Yuva 3: రూ. 6 వేలకే స్టైలిష్ స్మార్ట్‌ఫోన్.. లావా యువ 3 మొబైల్ విడుదల, ఇది మేడ్ ఇన్ ఇండియా.. ఫీచర్లు కూడా అదుర్స్!
Lava yuva 3 smartphone | Pic: twitter

Lava Yuva 3 Smartphone: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ 'లావా మొబైల్స్', తాజాగా తమ యువ సిరీస్ లో మరొక మోడల్ ను ప్రవేశపెట్టింది. లావా యువ3 పేరుతో భారత మార్కెట్లో ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. మెరుగైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను బడ్జెట్ ధరలోనే అందించనున్నారు.

Lava Yuva 3 స్మార్ట్‌ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. మొదటిది 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కాగా, రెండవది 4GB RAM + 128GB స్టోరేజ్ సామర్థ్యంతో లభిస్తుంది. ఈ రెండింటిలోనూ ర్యామ్ ను 8GB వరకు విస్తరించుకోవచ్చని చెబుతున్నారు. ఈ హ్యాండ్ సెట్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది, భవిష్యత్తులో దీనిని ఆండ్రాయిడ్ 14కు అప్‌గ్రేడ్‌ను హామీ ఇస్తున్నారు.

లావా Lava Yuva 3 స్మార్ట్‌ఫోన్ ఎక్లిప్స్ బ్లాక్, కాస్మిక్ లావెండర్ మరియు గెలాక్సీ వైట్ వంటి మూడు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

Lava Yuva 3  స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.5 అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 4GB RAM, 64/128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • యూనిసోక్ T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్
  • వెనకవైపు 13MP+2 AI ట్రిపుల్ కెమెరా, ముందు భాగంలో 5 MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 18W ఛార్జర్
  • ధరలు:  64GB వేరియంట్ కోసం రూ. 6,799/-

    128 GB వేరియంట్ కోసం రూ. 7,299/-

కనెక్టివిటీ కోసం డ్యూయల్ సిమ్ స్లాట్, USB టైప్-C పోర్ట్,  ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ మొదలైన ఫీచర్స్ ఉన్నాయి.  అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫిబ్రవరి 7 నుండి అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ఇవి ఫిబ్రవరి 10 నుండి లావా ఇ-స్టోర్‌తో పాటు, ఇతర కంపెనీ రిటైల్ స్టోర్‌లలో విక్రయించబడతాయి.