Nubia Red Magic 3S: గేమింగ్స్‌కి ప్రత్యేకం, ఫోన్ వేడెక్కకుండా ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్, నుబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఇతర ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి

8GB RAM + 128GB స్టోరేజ్ సామర్థ్యంతో మొదలై, టాప్ వేరియంట్ లో 12GB RAM + 256GB స్టోరేజ్ సామర్థ్యం వరకు లభిస్తుంది. 6.65-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి 2.5 డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌రక్షణతో...

Nubia Red Magic 3S: గేమింగ్స్‌కి ప్రత్యేకం, ఫోన్ వేడెక్కకుండా ఇన్‌బిల్ట్ కూలింగ్ ఫ్యాన్, నుబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ స్మార్ట్‌ఫోన్‌ ధర, ఇతర ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి
Nubia Red Magic 3S smartphone go on sale from this Diwali | Photo: Twitter

New Delhi, October 18:  మొబైల్ గేమింగ్స్‌ని బాగా సపోర్ట్ చేయగలిగిలా ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్‌లను రూపొందించే నుబియా మొబైల్ తయారీదారి సంస్థ నుండి సరికొత్తగా నుబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ (Nubia Red Magic 3S) విడుదలైంది. ఈ ఫోన్ లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC ప్రాసెసర్‌ ఉండటం హైలైట్‌గా చెప్తున్నారు. గేమ్స్ ఆడుతున్నప్పుడు మొబైల్ వేడెక్కకుండా ఇన్‌బిల్ట్  కూలింగ్ ఫ్యాన్ అందిస్తున్నారు.

నుబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్ డ్యూయల్ సిమ్ (నానో-సిమ్) సదుపాయాన్ని కలిగి ఉంది. 8GB RAM + 128GB స్టోరేజ్ సామర్థ్యంతో మొదలై, టాప్ వేరియంట్ లో 12GB RAM + 256GB స్టోరేజ్ సామర్థ్యం వరకు లభిస్తుంది. 6.65-అంగుళాల పూర్తి-హెచ్‌డి + (1080x2340 పిక్సెల్స్) అమోలేడ్ డిస్‌ప్లేను కలిగి 2.5 డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌రక్షణతో అందజేస్తున్నారు.

నుబియా రెడ్ మ్యాజిక్ 3ఎస్, 48 మెగాపిక్సెల్ సోనీ IMX586 సెన్సార్‌తో సింగిల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, USB టైప్-సి మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఈ స్మార్ట్‌ఫోన్‌ కనెక్టివిటీలో నాణ్యతా ప్రామాణికాలుగా చెప్పవచ్చు. యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

Nubia Red Magic 3S విశిష్టతలు..

Nubia Red Magic 3S విశిష్టతలు..

6.65 అంగుళాల ఫుల్- హెచ్‌డీ స్క్రీన్

48 మెగా పిక్సెల్ వెనక కెమెరా, 16 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా

క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855+ SoC ప్రాసెసర్‌

5000mAh బ్యాటరీ సామర్థ్యం

ర్యామ్ 8GB ర్యామ్ /64GB స్టోరేజ్ మరియు 12GB ర్యామ్/256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు

అండ్రాయిడ్ 9 పై (Android 9 Pie) ఆపరేటింగ్ సిస్టమ్

ధరలు: వేరియంట్ ను బట్టి రూ. 35,999 నుంచి రూ. 47,999 వరకు ఉన్నాయి.

'ఫ్లిప్‌కార్ట్' లో 'బిగ్ దీపావళి సేల్' సందర్భంగా అక్టోబర్ 21 నుంచి అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నారు.

 

(The above story first appeared on LatestLY on Oct 18, 2019 04:51 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).