tcl 505 smartphone | X pic

TCL 505 Smartphone: ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీదారు టీసీఎల్ గత జనవరిలో అనేక కొత్త ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేసింది. ఇవన్నీ మిడ్-రేంజ్ శ్రేణికి చెందినవి. అయితే తాజాగా బడ్జెట్ ధరలో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టింది. TCL 505 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్‌ మీకు రూ. 10 వేల బడ్జెట్ ధరలో లభించనుంది. ఈ సరసమైన స్మార్ట్‌ఫోన్‌ను TCL కంపెనీ తమ గ్లోబల్ వెబ్‌సైట్‌లో జాబితా చేసింది.

టీసీఎల్ కొత్త ఫోన్ రిఫ్లెక్టివ్ ఫినిషింగ్‌తో పాటు వెనుకవైపు రెండు కెమెరాలతో కూడిన ఆకర్షణీయమైన ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో మెరుగైన ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ఈ ఫోన్ పెద్దని డిస్‌ప్లేను కలిగి ఉండటంతో పాటు బ్లూ లైట్ ఎక్స్‌పోజర్‌ను తగ్గించడానికి, ప్రతిబింబాలను తగ్గించడానికి 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. బ్యాటరీ సామర్థ్యం బాగుంది, లేటేస్ట్ వెర్షన్ ఆండ్రాయిండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అందిస్తున్నారు.

TCL 505 ఓషన్ బ్లూ , స్పేస్ గ్రే అనే రెండు ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంటుంది. ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి, ధర ఎంత తదితర విషయాలను ఈ కింద తెలుసుకోండి.

TCL 505 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

  • 90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.75 అంగుళాల HD+ డిస్‌ప్లే
  • 4GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
  • మీడియాటెక్ హీలియో G36 ప్రాసెసర్
  • వెనకవైపు 50MP+ 2MP డ్యూయల్ కెమెరా, ముందు భాగంలో 5MP సెల్ఫీ షూటర్‌
  • ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
  • 5010 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
  • ధర రూ. 9,990/- (అంచనా)

ఈ ఫోన్ కొనుగోలుదారులకు ఎప్పట్నించి అందుబాటులో ఉంటుందో కంపెనీ ఇంకా ప్రకటించలేదు. అయితే త్వరలోనే ఆకట్టుకునే ధరతో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు పలు టెక్ నివేదికలు వెల్లడించాయి.