Xiaomi Pad 6S Pro: అతిపెద్ద బ్యాటరీ, అమితమైన స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌తో రాబోతున్న షావోమి సరికొత్త టాబ్లెట్, ఫీచర్లలో దీనితో పోటీపడే డివైజ్ ఇప్పటివరకు రాలేదు, లాంచ్ తేదీ వివరాలు తెలుసుకోండి!
Xiaomi Pad 6S Pro Tablet: చైనీస్ టెక్ సంస్థ షావోమి తమ బ్రాండ్ నుంచి Xiaomi 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌తో పాటు Xiaomi Pad 6S Pro టాబ్లెట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. అయితే షావోమి లాంచ్ చేయబోతున్న Xiaomi Pad 6S Proటాబ్లెట్‌పై ఇప్పుడు టెక్ ప్రియులు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ టాబ్లెట్ డిజైన్, కొన్ని కీలక ఫీచర్లను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇది Xiaomi ప్యాడ్ 6 లైనప్‌లోని ఇతర మోడళ్లతో సమానమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఇక టాబ్లెట్ ఫీచర్లను పరిశీలిస్తే Qualcomm యొక్క స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 SoC ద్వారా శక్తిని పొందుతుంది. దీని ఆపరేటింగ్ సిస్టమ్ Xiaomi యొక్క కొత్త HyperOS అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ టాబ్లెట్‌తో పాటుగా మాగ్నెటిక్ కీబోర్డ్ మరియు స్టైలస్‌ను అందిస్తున్నట్లు సమాచారం.
Xiaomi Pad 6S Pro టాబ్లెట్ 3K రిజల్యూషన్‌తో 12.4-అంగుళాల LCD ప్యానెల్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్ మరియు 3:2 కారక నిష్పత్తిని కలిగి ఉన్నట్లు నిర్ధారించబడింది. టాబ్లెట్ 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, Wi-Fi 7 కనెక్టివిటీకి మద్దతు ఇస్తుంది.
అంచనాల ప్రకారం, ఈ టాబ్లెట్ గరిష్టంగా 24GB RAM మరియు 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌కు మద్దతుతో వచ్చే అవకాశం ఉంది, అలాగే 10,000mAh బ్యాటరీ, 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరాను కూడా కలిగి ఉండవచ్చు. అయితే పూర్తి వివరాలు ఫిబ్రవరి 22న లాంచ్ తేదీన తెలియనున్నాయి.
Xiaomi Pad 6S Pro వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధరలు పాత మోడల్ అయిన ప్యాడ్ 6 ప్రోకి సమానంగా ఉండవచ్చు. అంచనాల ప్రకారం, బేస్ మోడల్ 8GB + 128GB వేరియంట్ కోసం CNY 2,399 (దాదాపు రూ. 28,500), 8GB + 256GB, 12GB + 256GB వేరియంట్ కోసం CNY 2,699 (దాదాపు రూ. 32,000), అలాగే 12GB + 512GB కాన్ఫిగరేషన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది. దీని ధర CNY 2,999 (దాదాపు రూ. 35,700) వరకు ఉండవచ్చు.
(The above story first appeared on LatestLY on Feb 19, 2024 06:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

