Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..
బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.
ఢాకా, జనవరి 23: పుష్ప ఫీవర్ క్రికెట్ ఆటగాళ్లను తెగ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే ఇండియన్ క్రికెటర్ సురేష్ రైనా.. ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలోని పాటలకు స్టెప్పులేశారు. అలాగే పుప్ప రాజ్ డైలాగ్స్‌తో రచ్చ చేశారు. తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు. బీబీఎల్‌లో జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చెందిన అమిత్ హసన్ వికెట్ తీశాడు. అంతేకాకుండా.. ఎక్స్ ట్రా కవర దిశగా బ్యాట్స్ మెన్ కొట్టిన షాట్‌ను ఫీల్డర్ పరుగెత్తి అద్భుతంగా అందుకున్నాడు. దీంతో అమిత్ హసన్ అల్లు అర్జున్ డైలాగ్.. తగ్గేదే లే అంటూ పుష్పరాజ్ మేనరిజాన్ని చూపిస్తూ. గడ్డం కింద నుంచి చేయి అడ్డంగా జరుపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Hype is Real.....@alluarjun 🙏🔥
Craze beyond boundaries means this only .....
Bangladesh Premier league
Celebration of a Player by taking a wicket....#ThaggedheLe #PushpaRaj #PushpaTheRise pic.twitter.com/nWLOk8XWfI
— Censor Buzz (@CensorBuz) January 22, 2022
(The above story first appeared on LatestLY on Jan 24, 2022 10:30 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

